Take a fresh look at your lifestyle.

రైతు వేదికలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

‌సూర్యాపేట, జులై 28, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావడానికి ఏర్పాటుచేస్తున్న రైతువేదికలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇట్టి తనిఖీలో భాగంగా కోదాడ సమీపంలోని అనంతగిరి మండలం అనంతగిరి, లకారం, త్రిపురాంలో ఏర్పాటుచేస్తున్న రైతు వేదికల నిర్మాణాలను తనిఖీ చేశారు.

ఈ వేదికలను త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చండూరు వెంకటేశ్వరరావు, జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్‌రెడ్డి, డిఆర్డిఓ ఏపిఓ పెంటయ్య, ఏవో సతీష్‌, ఎమ్మార్వో, మండల వ్యవసాయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply