Take a fresh look at your lifestyle.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు రూ.60 కోట్ల చెల్లించినట్లు జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు అన్నారు. ఐనవోలు మండలం లో పంతని, పున్నేలు గ్రామాలలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం కలెక్టర్‌ ‌తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 9668 రైతులకు సం•ంధించిన 51 వేల 830 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 5977 మంది రైతులకు రూ.60 కోట్ల 7లక్షలను రైతు ఖాతాలలో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న ధాన్యం తేమ శాతంను పరిశీలించారు.

రైస్‌ ‌మిల్లుల వద్ద అన్‌ ‌లోడింగ్‌ ‌జాప్యం జరుగుతుందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా రైతులు స్వతహాగా గోనె సంచులు తెచ్చుకున్న పక్షంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 21.42 కోట్ల విలువైన 12వేల 169మెట్రిక్‌ ‌టన్నుల ను 2310 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ ‌తెలిపారు. అందులో ఇప్పటి వరకు ఒక కోటి 15 లకల రూపాయలను చెల్లించినట్లు చెప్పారు. కలెక్టర్‌ ‌వెంట డిసిఓ సునంద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply