Take a fresh look at your lifestyle.

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌

‌నాగర్‌కర్నూల్‌: ‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌  ‌శ్రీధర్‌ ‌గురువారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఈ ‌శ్రీధర్‌ ‌చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకు వెళ్తూ, ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలిపేవే దినపత్రికలు అని  అన్నారు.

నేటి పోటీ ప్రపంచంలో పత్రికల నిర్వహణ భాగంగా మారినప్పటికీ విలువలను దిగజార్చనీయకుండా నిజాన్ని నిర్భయంగా చాటే జర్నలిస్టులు ఉండడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రజాతంత్ర జిల్లా స్టాప్‌ ‌రిపోర్టర్‌ ‌సందు యాదగిరి, రిపోర్టర్‌లు సుదర్శన్‌, ‌శివకుమార్‌, ‌టియుడబ్లూజే(ఐజేయు)జిల్లా నాయకులు కొండకింది మాధవరెడ్డి, కంచెర్ల శ్యాంసుంధర్‌, ‌సహదేవుడు, దస్తగిరి, విజయ్‌, ‌వెంకటస్వామి, మలిపెద్ది రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags:  district Collector, sridhar invented, prajatantra calendar, camp office, iju kondakindhi malli

Leave a Reply

error: Content is protected !!