Take a fresh look at your lifestyle.

మండలంలో కలెక్టర్‌ ‌విస్తృత పర్యటన

khammam district Collector, rv karnan, extensive tour, mandal, mpdo 

కారేపల్లి:  గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యాచరణలో  భాగంగా ప్రతి వార్డు మెంబరు తన  వార్డు అభివృద్ధి బాధ్యతతనదేనని సర్పంచ్‌ ‌పర్యవేక్షణలో వార్డు మెంబర్లు సమన్వయంతో పనిచేసి వారి వార్డు అభివృద్ధి చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌ ‌వి కర్ణన్‌ అన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురు వారం కలెక్టర్‌ ‌సింగరేణి మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటనలో భాగంగా సింగరేణి గ్రామపంచాయతీ కి పర్యవేక్షణ నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆదేర్ల స్రవంతి,  వార్డుమెంబర్‌ ‌తో మాట్లాడుతూ ప్రతి వార్డుని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, పల్లె ప్రగతి సమావేశానికి రాని వార్డు మెంబర్లకి, అభివృద్ధిలో పాలుపంచుకోని వార్డు మెంబర్‌ ‌లకి వెంటనే నోటీసులు ఇవ్వమని ఆదేశించారు, మండలంలో వివిధ గ్రామ పంచాయతీల్లో కలెక్టర్‌ ‌పర్యవేక్షించారు.

ఈ పర్యవేక్షణ సందర్భాల్లో కొన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించి పెండింగ్‌ ఉన్న కార్యక్రమాలను కూడా పర్యవేక్షించి లో ఉన్న పనులను  వెంటనే  పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా  సింగరేణి మండలంలోనూ కలెక్టర్‌ ‌విస్తృతంగా  పర్యటించారు. ఇందులో భాగంగా మాదారం గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మాదారం గ్రామపం చాయతీలో వేసిన గ్రావెల్‌ ‌రోడ్లు పైపులైన్లు వాల్‌ ‌చాంబర్స్ ‌నిర్మించిన వాటిని పరిశీలించారు. అదేవిధంగా మాదారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నిధులు మాదారం గ్రామ పంచాయతీకి విడుదలకు కృషిచేయాలని కలెక్టర్‌ను కోరారు.   అనంతరం ప్లాంట్‌ ‌కలెక్టర్‌ ‌యాజమాన్యంతో చర్చించారు. కార్యక్రమంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ‌రమేష్‌ ‌బాబు,  ఎంపిపి శకుంతల  తహసీల్దార్‌ ‌పుల్లయ్య ఎంపీడీవో మాచర్ల రమాదేవి ఉప సర్పంచ్‌ ‌వెంకట అప్పారావు  సెక్రెటరీ నరేష్‌  ‌వార్డు మెంబర్లు సౌజన్య, లాలూ, రవి, విజయ కో ఆప్షన్‌ ‌సభ్యులు సంగయ్య గ్రామస్తులు స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌యాజమాన్యం కిరణ్‌  ‌జి ఎం శ్రీనివాసరావు  పర్సనల్‌ ‌మేనేజర్‌ ‌చిట్టి రాజు పాల్గొన్నారు.

Tags: khammam district Collector, rv karnan, extensive tour, mandal, mpdo

Leave a Reply