హన్మకొండ, : శానిటేషన్ అధికారులపై జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హన్మకొండ న్యూ బస్‌స్టాండ్ సమీపంలో గల అంబేడ్కర్ నగర్ కాలనీ, అడ్వకేట్ కాలనీలోని శ్రీనివాస వీధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ నగర్‌లో శానిటేషన్ సక్రమంగా లేకపోవడంతో కలెక్టర్‌తో పాటుగా కమిషనర్ సిబ్బందిపై, ప్రత్యేక అధికారిపై మండిపడ్డారు.
పట్టణ ప్రగతిలో కూడా శానిటేషన్ అధ్వాన్నంగా ఉంటే ఏమి చేస్తున్నారని ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని చెప్పినప్పటికీ కూడా అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవసరమైన వాహనాలు, మిషన్లు, పారిశుధ్య కార్మికులు కావాలంటే ఏంహెచ్‌ఓకు తెలియజేస్తే పంపించే ఏర్పాట్లు చేయమని ఆదేశించినట్లు చెప్పారు. పారిశుధ్య జవాన్ పిలిచి అసలు ఈ వార్డులో పనిచేస్తున్నవా లేదా ఇంట్లో ఉంటున్నవా అంటూ కమిషనర్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కాలనీ నుండి అడ్వకేట్ కాలనీ, శ్రీనివాస్ వీధిలో కూడా అపరిశుభ్రంగానే ఉందన్నారు. రోడ్డుకు ఖాళీ స్థలం ఉన్న కూడా మొక్కలు నాటకుండా ఖాళీగా పెట్టడం సహించేది లేదన్నారు. ప్రధాన రోడ్డు మార్గంలోనే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు, మిగితా ప్రాంతంలో పరిశుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఫి•ర్యాదు చేశారు.
అంతర్గత రోడ్డు కూడా నియమ నిభందలకు విరుద్ధంగా ఉందని రోడ్డును కూడా ఆక్రమించి గృహాలు నిర్మించుకున్నారని, మురుగు కాలవలో సీసాలు చెత్త చెదారం ఉండడంతో ఇంటి యజమాని పట్టింపు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం నోటీస్ ఇవ్వకుండానే ఎంక్రోచ్ మెంటును తొలగించ వచ్చునని అంతర్గత రోడ్లు చట్టం ప్రకారం 40 ఫీట్లు రోడ్డు ఉండే విధంగా ఎంక్రొచ్ మెంటు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. కోర్టులో 100 వరకు కంటెంట్ కేసులున్నయని మరో 100 కేసులైన రోడ్ల ఎంక్రోచ్‌మెంట్ తొలగిస్తామని కమిషనర్ అన్నారు. పట్టణ ప్రగతి అందరి భాగస్వామ్యం కావాలని అన్ని కార్పొరేషన్ చేయదని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి దయానంద్, మునిసిపల్ ఇంజనీర్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Collector, outraged,sanitation, officers