Take a fresh look at your lifestyle.

ఇసుక అక్రమ రవాణాకు కలెక్టర్‌ ‌చెక్‌

జిల్లాలో అక్రమ రవాణా నివారణ, క్రమబద్ధీకరణ పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ‌వీపీ గౌతమ్‌ అన్నారు.శుక్రవారం మరిపెడ ఎంపిడిఓ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ పోలీస్‌ ‌మైనింగ్‌ ‌శాఖ, పంచాయతీ రాజ్‌, ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూం అధికారులతో కలెక్టర్‌ ‌సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో వ్యాపారంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, పూర్తి స్థాయిలో అక్రమ నివారణ కై అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేయాలని ముఖ్యంగా 7 మండలాల్లో జరుగు తున్నట్లు వాటికి బార్డర్‌ ‌చెక్‌ ‌పోస్ట్లు ఏర్పాటు చేయాలని, వారంలో మంగళవా రం నుండి శుక్రవారం వరకు నాలుగు రోజులు మాత్రమే ప్రభుత్వ, అభివృద్ధి పనులకు డబల్‌ ‌బెడ్రూమ్స్ ‌సిసి రోడ్ల నిర్మాణాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, ‌క్రిమిటోరియా, టెండర్‌ ‌వర్క్, ‌నామినేషన్‌ ‌వర్కు మాత్రమే ఇసుక రవాణా చేయాలని, సంబంధిత అధికారి నుండి అవసరమగు ట్రిప్పులు, రవాణా చేయు ట్రాక్టర్‌ ‌పూర్తి వివరాలు ఆర్డీవో కార్యాలయంలో అందజేసి టోకెన్స్ ‌విధానంపై రవాణా చేసేట్లుగా ఆయా మండలాల తహసీల్దార్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీల పర్యవేక్షణలో దూరాన్ని బట్టి ట్రిప్పులకు టోకెన్స్ ఇవ్వాలని చెక్పోస్టుల వద్ద విఆర్‌ఏ ‌లను కాపలాగా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే వేయి మందికి పైగా కేసులు పెట్టామని మళ్లీ అక్రమ రవాణా జరిపితే బైండర్లు, రౌడీషీట్లు , పీడీ యాక్ట్ ‌కేసులు పెట్టి బండ్లు సీజ్‌ ‌చేయడం జరుగుతుందని వైలెన్స్ ‌క్రియేట్‌ ‌చేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని ఇసుక అక్రమ రవాణా నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పి కోటిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, ఆర్‌ ‌డి ఓ ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, 7 మండలాల తహసీల్దార్లు, మైనింగ్‌ ‌పంచాయతీరాజ్‌ ‌శాఖ అధికారులు సిఐలు చేరాలు,కరుణాకర్‌,ఎస్సైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతులందర్నీ సంఘటితపర్చేందుకు రైతు వేదికలు
రైతుల అందర్నీ సంఘటిత పరిచేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ‌బి పి గౌతమ్‌ ‌తెలిపారు.మరిపెడ మండలం తండ దర్మారం లో శుక్రవారం రైతు సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో 80 రైతు వేదికలను నిర్మించి సంఘటిత పరుస్తున్నదని తెలియజేశారు.ఈ వేదికల ద్వారా రైతులను సమన్వయ పరుస్తూ నియంత్రిత పద్ధతిలో పంటల సాగు లాభసాటి వ్యవసాయం పై చర్చిస్తూ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల నే వేస్తూ రైతులు ఆర్థిక ప్రగతి సాధించా లనే ప్రభుత్వ ఆశయంగా కలెక్టర్‌ ‌వివరించారు. జిల్లాలో కంది పంట 15 వేల ఎకరాల్లో వేసుకునే అవకాశం ఉందన్నారు కంది కింటా 5,500 ధర పలుకుతుందని రైతులకు వివరించారు మక్కా పంట ఎట్టిపరిస్థితుల్లో వేయరాదని వానకాలం ఫంగస్‌ ‌వంటి సోకి పంట దిగుబడి తగ్గుతుంది అన్నారు అంతేకాకుండా మక్క మార్కెట్లో రేటు ఉండదన్నారు. మిర్చి కూడా ఒకప్పుడు 20 వేలు క్వింటాగా ఉండేదని నేడు 13 వేలకు క్వింటా ధర పలుకుతుంది అన్నారు ఈ రైతు సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్‌ ‌గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌నవీన్‌ ‌రావు,మండల సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ ‌యాదగిరి రెడ్డి,జెడ్పిటిసి శారద రవీందర్‌, ఎం ‌పి పి అరుణ రాంబాబు, మరిపెడ మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌సింధూర రవి, వైస్‌ ఎం‌పిపి గాదే అశోక్‌ ‌రెడ్డి,ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు రఘు, సర్పంచ్‌ ‌ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌,అయూబ్‌ ‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply