నిజామాబాద్, 17 (ప్రజాతంత్ర ప్రతినిధి) ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మండలంలోని పిప్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. ఈ కళాశాలలో ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు స్ట్రాంగ్ రూముల్లో కౌంటింగ్ హాల్లో ఏ విధంగా ఏర్పాటు చేయాలో సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బందికి వేరువేరుగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై మరొకసారి చర్చిద్దామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్ డి ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులున్నారు.
Tags: Collector examined,Armor Counting Center,narayan reddy,nizamabad