Take a fresh look at your lifestyle.

దూరదర్శన్‌ ‌ప్రసారాలపై చర్చిస్తున్న కలెక్టర్‌

‌వనపర్తి,సెప్టెంబర్‌,08 (‌ప్రజాతంత్ర విలేకరి): వనపర్తి జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష తో దూరదర్శిన్‌ ఆల్‌ఇం‌డియా రేడియో సౌత్‌ ‌జోన్‌ అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌వి. రమాకాంత్‌ ‌దూరదర్శిన్‌ ‌ప్రసారాలను ఆన్‌లైన్‌ ‌విద్యాబోధన ప్రసారాల గురించి చర్చించారు. దూరదర్శన్‌ ‌ప్రసారాలను కలెక్టర్‌ ‌కార్యాలయంలోచర్చించారు. దూరదర్శన్‌లో పాఠాలు వినడంలో ప్రసార పరంగా ఇబ్బందుల ఏమైన ఉన్నాయఅని విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పారు. అన్ని చోట్ల విద్యార్థులు పాఠాలు వింటున్నారని విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకొని పాఠాలను ప్రసారం చేయడం అభినందనీయమని కలెక్టర్‌ అన్నారు.

దూరదర్శిన్‌లో అవసరమయితే కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోనిఅయిన సరే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని రమాకాంత్‌ ‌వివరించారు. విద్యార్థుల దగ్గరికి ఉపాధ్యాయులు వెళ్లినప్పుడు ఆల్‌ఇం‌డియా రేడియో ఆయా ప్రాంతాల్లో వస్తున్నది లేనిది తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో రూపొందించే విద్యా కార్యక్రమాలకు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలౌతుందన్నారు. తప్పకుండా విద్యార్థులకు ఉపయోగపడే పాఠాల యూట్యూబ్‌ ‌లింక్‌ ‌వినియోగించుకునేలా అందరు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు సమాచారం ఇవ్వమని కలెక్టర్‌ ‌విద్యాశాఖాధికారులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!