కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
కోర్టులో స్టే ఆర్డర్లో ఉన్న కేసు లపై వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత జాప్యం లేకుండా చార్జీ షీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందించని పక్షంలో తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో ఏలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా విచారణ జరపాలని అధికారులను అదేశించారు. విచారణ (యుఐ) స్థాయిలో 36 కేసులు పెండింగ్ ట్రయల్ (పిటి)లో 143 కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారం అందించేందుకు 66 కేసులకు 39 కేసులకు రూ.48లక్షల62వేలను వివిధ స్థాయిలో పరిహారాన్ని అందించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలు సరిగా లేనందున జాప్యం జరిగిందని 10 రోజులు అందరికీ పరిహారాన్ని అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కమిటీ సభ్యులు బొమ్మ కట్టయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలల కొకసారి జరుగవలసిన సమావేశం జాప్యం జరుగుతున్నదని ఇక నుండి సకాలంలో కమిటీ సమావేశం జరిగే విధంగా శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈసమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు మెంబర్లుగా ఉంటారని వారు కూడా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరిగినప్పుడు కొన్ని పోలీస్స్టేషన్లలో తొందరగా కేసు నమోదు కావడం లేదన్నా రు. కమిటీ మెంబర్ పరుషరాములు మాట్లాడుతూ విచారణలో (యుఐ) కేసులు అండర్ ట్రయల్, పెండింగ్లో ఉన్న కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పరంజ్యోతి మాట్లాడుతూ దళితుల భూములకు పట్టాలు రాకుండా కొందరు భూకబ్జా దారులు ఇబ్బంది పెడుతున్నారని అధికారులు విచారణ చేసి న్యాయం చేయలని కోరారు. ఈ సమావేశం లో కలెక్టర్, ఆర్డీవో వాసు చంద్ర, డిసిపి పుష్ప, జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ అధికారి నిర్మల, కమిటీ మెంబర్లు జడ్ రామ్ దాస్ భద్రునాయక్, దామోదర్, ఎన్ఎస్ నాయక్, వేణుగోపాల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.