ప్రపంచ దేశాలను వనికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమి కోట్టడానికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా చర్యలు చేపట్టి నివారించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్,ఎస్సీ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్‌లు వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా, మండల అధికారులతో కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనాను అరికట్టడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, దీనికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గత 15 రోజులుగా ఎవరు ఎక్కడి నుండి వచ్చారు,వారికి వ్యాది లక్షణాలు ఉన్నాయా,లేవా అని పరిశీలన చెయ్యాలన్నారు.ఈ దిశగా గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి,ఆశా/ఏఎన్ఎం,గ్రామ పోలీస్ అధికారి,పంచాయితీ కార్యదర్శిలు కలిసి అయా గ్రామాల్లో సమగ్ర విచారణ చేపట్టి సంతకాలతో జాబితా సమర్పించాలన్నారు. అంతే కాకుండా మండల స్థాయిలో ఎంపిడివో,తహశీల్దార్,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,మండల పంచాయితీ అధికారులు వారి వారి మండలాలకు సంబం దించి జాబితా సమర్పించాలన్నారు.
విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో వ్యాధి లక్షణాలు ఉంటే వారిని వెంటనే హైదరాబాద్ తరలించుటకు చర్యలు తీసుకోవా లని, లేని యెడల 14 రోజుల పాటు ఇంటి నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాది లక్షణాలు ఉన్నచో జిల్లా సర్వేలేన్స్ అధికారికి (9949565907) గాని, కరోనా హెల్ప్ లైన్ డెస్క్ (9703913292, 9553215157)కు గాని, జిల్లా వైద్యాధికారికి గాని తెలియపరుచాలన్నారు.పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకోని పరీక్షకు గంట ముందుడేటాల్తో వైపింగ్ చేయాలని, తనిఖీల్లో ఈ పనులు చేయ్యని వారిపై చర్యలు తప్పవని ఆన్నారు. పబ్లిక్ స్థలాలు,పంక్షన్ హల్స్, పార్కులు, గ్రందాలయాలు,సినిమా హల్స్ మూసివేయాలన్నా రు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, గురు ద్వార్ తదితర ప్రార్ధన స్థలాల్లో ఆయా మత పెద్దలు సమావేశమై కరోనా వైరస్‌పై పరిస్థితి పట్ల అవగాహన కల్పించాలన్నారు. వీరంతా వీలైనంత వరకు ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవా లని సూచించారు. జిల్లాలోని మేడారం,మల్లూరు దేవాలయాలకు భక్తులు రావద్దని తెలుపుతూ పస్రా,తాడ్వాయిల నుండి దారి వెంట 20 ప్లెక్సీ లు ఏర్పాటు చేయ్యాలన్నారు.
వైద్యాధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, హెడ్ క్వార్టర్ నుండి అనుమతి లేనిదే విడిచి వెల్లోద్దని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. జిల్లా ఎస్సీ మాట్లాడుతూ అన్ని పోలీస్ స్టేషన్లకు సానిటైజర్లు,సబ్బులు ఆందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జన సమూహం ఎక్కువగా ఉండ కుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల, మండల స్థాయిలో కలెక్టర్ అదేశా లను అమలు చేయ్యాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో ఏఎస్పీ సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి, ఓఎస్డీ సురేష్‌కుమార్, ఏఆర్ ఆడిషనల్ ఎస్పీ కుమారస్వామి,జెడ్పీ సీఈవో పారిజాతం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, జిల్లా పౌరసంబందాల అధికారి ఆరవింద్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు.