“మనిషి గుండెల్లోంచి వచ్చిన పాట, సృజనాత్మకమైన ఆట. జనాన్ని ఎంతో ఆకట్టుకుంది. అందరి లక్ష్యం ఒక్కటే. అందరి నోటా ఒకటే మాట. సీఏఏ, ఎన్ఆర్సీలు వద్దేవద్దు...
సీఏఏనీ, ఎన్ ఆర్సీనీ వ్యతిరేకిస్తూ గంభీరోపన్యాసాలు చేయడం వేరు, కళాకారులు, క్రీడాకారులు తమ వంతు బాధ్యతగా ఆందోళన నిర్వహించడం వేరు. ప్రజలను ఎక్కువగా ఆకట్టుకున్న ప్రదర్శన ఇది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ ఇలాంటి ప్రదరనను తిలకించడానికి తరలి రాలేదు. ఈ ప్రదర్శనల్లో ముస్లింలు, హిందువులు, బంగ్లాదేశ్ వలసదారులు, స్థానికులు అందరూ తరతమ భేదం లేకుండా పాల్గొన్నారు. ఇది తమ జీవన పోరాటమనీ, చావోరేవో తేల్చుకోవడానికి ఇదే తుది పోరాటమని వారు అన్నారు. బెంగాల్ విభజన జరిగిన తర్వాత నుంచి మతపరమైన సమతౌల్యం ఇప్పుడే కనిపించింది. ఇకపైన కూడా ఇది కొనసాగుతుందా..?”
కొత్త పాతల మేలు కలయిక ..వివిధ• రకాల వాయిద్య పరికరాలను ఉపయోగించి ప్రదర్శనలు..ప్రాచుర్యం పొందిన బంగ్లా రాక్‌ను నిరసన గీతాలకు అనువుగా తీర్చిదిద్ది, వినియోగించడం మొదలైన అంశాలతో కోల్ కతాలో వైవిధ్య భరితమైన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు రూపకల్పన ఇది నాంది.
కోల్‌కతా నగరంలో అత్యంత ప్రధానమైన సిఐటి రోడ్డు నుంచి పార్క్ సర్కస్ మైదాన్ వరకూ ఆ ప్రాంతమంతా ఇటీవల సంగీతం, సాహిత్య కార్యక్రమాలతో దద్దరిల్లింది. కవిత్వం, నినాదాలు నగరంలో ప్రతిధ్వనించాయి. ఆదివారం టెలివిజన్ చానల్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ, క్రీడాకారులు, పెద్ద ప్రదర్శన నిర్వహించారు. కోల్ కతాలో ఆదివారం సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రదర్సనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి వైవిధ్యభరితంగా క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు. వారంతా ఏకైక లక్ష్య సాధనకై ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌పై వారు ఈ ప్రదర్శన నిర్వహించారు. కోల్ కతాలో ఒక వైపు ఈ ప్రదర్శన, మరో వైపు ఫుట్ బాల్ మ్యాచ్ జనాన్ని ఆకర్షించాయి. తూర్పు బెంగాల్లో మోహన్ బగన్ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. కోల్ కతా ఐ లీగ్ డెర్బీ మ్యాచ్ సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన సందర్బంగా తూర్పు బెంగాల్‌కి చెందిన ఫుట్ బాల్ అభిమానులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలపై తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
నృత్య రీతులతో ఉన్న ప్రదర్శికలను అమర్చారు. వాటిపై రక్త్ దియే కెనామతి, కాగజ్ దియే నోయ్(రక్తంతో భూమిని సాధించుకున్నాం) మరో నినాదంతో అత్యంత ప్రాచుర్యం పొందిన నారాయణ్ దేబ్ నాథ్ సృష్టించిన పాత్ర నోటంట వెలువడిన నినాదాన్ని అనుకరిస్తూ పాలా పాలా ఎన్ఆర్సీ అశ్చోచ్చే( తప్పుకోండి..ఎన్ఆర్సీ వస్తోంది) నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈస్ట్ బెంగాల్ మోహన్ బగన్ మ్యాచ్‌ని 60 వేల మంది వీక్షించారు. వీరిలో అధిక సంఖ్యాకులు తూర్పు బెంగాల్ మద్దతుదారులు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు. సభికులను ఉత్తేజ పర్చే ప్రసంగాలు ఈ ర్యాలీలో జరిగాయి. బెంగాలీల్లో సహజంగా ఉండే భావోద్వాగాలు ఎల్లెడలా వ్యాపించాయి. అసాధారణ ఫీట్స్ ప్రతిభను కనబర్చే కార్యక్రమాలు జరిగాయి. మోహన్ బగన్ తూర్పు బెంగాల్‌ను 2-1 తేడాతో ఓడించింది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఫిలిప్స్ మైదాన్‌లో ఫాసిజానికి వ్యతిరేకంగా పీపుల్స్ కార్నివాల్ కార్యక్రమం జరిగింది. ఇక్కడకు వొచ్చిన వారంతా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20కి పైగా థియేటర్ బృందాలు బ్యాండ్లు, సంగీత పరికరాలతో ఎనిమిది గంటల సేపు క్రీడాకారులు, కళాకారులు జనాన్ని అలరించారు. అందరిలో ఉత్సాహం ఉరకలు వేసింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. యువతరానికి చెందిన వారూ, కాలేజీ విద్యార్థులు రాసుకొచ్చిన పాటలతో, గేయాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. పృధ్వీరాజ్ బిశ్వాస్ అనే కాలేజీ విద్యార్థి రంగస్థలానికి సంబంధించి సంప్రదాయక బరులను తెంచేస్తున్నామని అన్నారు.
కొత్త భాషలో, కొత్త తరహాలో నిరసన తెలియజేస్తున్నామని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి పరిచయ్ ఘోషాల్ అన్నారు.
ఇది పూర్తిగా నవతరం నిరసన ప్రదర్శన అని రంగస్థల ప్రముఖుడు శాంతిలాల్ ముఖర్జీ అన్నారు. ఇలాంటి నిరసన ప్రదర్శన జరగడం ఇదే మొదటి సారి అనీ, దీనికి అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన అన్నారు. పౌర హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇది. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. దేశంలో ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కు కావాలని కోరుతున్నారని ఆయన అన్నారు. వామపక్షాల వారు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలకు భినంగా ఇది జరిగింది. వాయిద్య కళాకారులు, సంగీత కళాకారుల జుగల్బందీ మాదిరిగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ పర్యవేక్షణ, అజమాయిషీ లేకుండా సాగడం వల్ల సాంస్కృతికపరమైన స్వయం ప్రతిపత్తి ఈ ప్రదర్శనకు వచ్చింది. ఈ ప్రదర్థనలో 200 పైగా థియేటర్ గ్రూపులు పాల్గొన్నాయని శాంతిలాల్ ముఖర్జీ చెప్పారు ఏడాది పొడవునా పని చేస్తాం. పాఠశాల గదుల్లోమా బృందాలు ప్రదర్శనలు ఇస్తాయి. జనబాహుళ్యంలోకి వచ్చి ప్రదర్శన ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు.
సీఏఏకి వ్యతిరేకంగా అందరూ కలిసి రావడం వల్ల ఈ సాంస్కృతిక కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందని ఆయన అన్నారు. సీఏఏనీ, ఎన్ ఆర్సీనీ వ్యతిరేకిస్తూ గంభీరోపన్యాసాలు చేయడం వేరు, కళాకారులు, క్రీడాకారులు తమ వంతు బాధ్యతగా ఆందోళన నిర్వహించడం వేరు. ప్రజలను ఎక్కువగా ఆకట్టుకున్న ప్రదర్శన ఇది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ ఇలాంటి ప్రదరనను తిలకించడానికి తరలి రాలేదు. ఈ ప్రదర్శనల్లో ముస్లింలు, హిందువులు, బంగ్లాదేశ్ వలసదారులు, స్థానికులు అందరూ తరతమ భేదం లేకుండా పాల్గొన్నారు. ఇది తమ జీవన పోరాటమనీ, చావోరేవో తేల్చుకోవడానికి ఇదే తుది పోరాటమని వారు అన్నారు. బెంగాల్ విభజన జరిగిన తర్వాత నుంచి మతపరమైన సమతౌల్యం ఇప్పుడే కనిపించింది. ఇకపైన కూడా ఇది కొనసాగుతుందా..?
– ‘ద వైర్’ సౌజన్యంతో..