Take a fresh look at your lifestyle.

కోల్డ్ ‌వార్‌ 2.0??

“రెండు బలమైన దేశాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ ‌వార్‌ ‌లాంటి వాతావరణం నిజంగానే సంబంధాలు చెడి ఏర్పడిందా లేకా మరేవో ఇతర ప్రయోజనాల కోసం పరిస్థితులను అలా మలుచుకుంటున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్ళ నుంచి ట్రంప్‌ అమెరికా కోసం ఏం చేశాడో ప్రజలకు వివరించాల్సిన సందర్భం. కరోనా కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం ఒడిదుడుకులకు లోనయ్యింది. అమెరికా కూడా మినహాయింపు కాదు. తర్వాత కరోన కరాళ నృత్యం.  కరోనా వేళ ట్రంప్‌ ‌నోటికి తాళం లేకుండా పోయింది. పరిస్థితులు చేయి దాటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే స్థితి వచ్చింది.”

rehana pendriveఅ‌గ్రరాజ్యానికి, డ్రాగన్‌ ‌దేశానికి మధ్య కోల్డ్ ‌వార్‌ ‌మొదలవుతుందన్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత కొంత కాలం నుంచి ఈ రెండు బలమైన ఆర్ధిక శక్తుల మధ్య నువ్వా, నేనా అన్న వాతావరణం ఉన్నా…తాజాగా పరిస్థితులు మరింత దిగజారాయి. గత కొంత కాలం నుంచి అమెరికా- చైనా మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతూనే ఉన్నా…తాజాగా వీరి మధ్య ఘర్షణపూరిత వాతావరణం మరింత పెరిగింది. అమెరికా బూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని ముసేసింది.  రెండు దేశాల సంబంధాల్లో ఇది తీవ్రమైన చర్యగా పరిగణించాలి. గతంలో అమెరికా కూడా ఎప్పుడూ ఇలాంటి చర్యకు దిగలేదు. దీనికి చైనా కూడా కౌంటర్‌ ఇచ్చింది.  చెంగ్‌ ‌డూ నగరంలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌పై ఉండే ఆ దేశ జాతీయ పతాకాన్ని అవనతం చేసింది (కిందకు దించేయటం). అయితే అమెరికా లాగా ఎంబసీని మూసేయటం వంటి ప్రతీకార్య చర్యలకు పూనుకోలేదు. అయితే ఆ దౌత్య కార్యాలయానికి వెళ్ళే రోడ్డు మార్గాన్ని పోలీసులు మూసేశారని మాత్రం వార్తలు వస్తున్నాయి. చైనా మేధా సంపత్తిని చౌర్యం చేస్తున్నందుకే  ఈ చర్యకు పాల్పడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ ‌పాంపియో చెబితే , తాము ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేక అమెరికా కుట్రలకు ప్రయత్నిస్తోందని చైనా కౌంటర్‌ ఆరోపణకు దిగింది. ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితులు మరింతగా ముందుకే వెళితే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ రెండు దేశాల సంబంధం కోణంలో ఏదో ఒక విధానపర నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అమెరికా వైఖరిని సమర్ధించటం, లేదా చైనాకు బాసటగా నిలబడటం అదీ కాదంటే ఇద్దరికీ సమాన దూరం పాటించటం.

cold war between china and america

కాలు దువ్వుకోవటానికి కారణాలేమిటి?
చైనా విషయంలో ట్రంప్‌ ‌దుందుడుకు స్వభావాన్నే ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ట్రంప్‌ ఎవరి పట్ల అయినా ఇదే వైఖరి అవలంబిస్తుంటారు. చివరకు అత్యంత ప్రియమైన స్నేహితుడిగా మసలుకునే భారత దేశం పట్ల కూడా మలేరియా మెడిసిన్‌ ‌కావలసి వచ్చిన సందర్భంలో ఇండియా ఇవ్వకపోతే రిటార్ట్ ‌చేయాల్సిందే కదా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకోకపోతే  అమెరికా నుంచి వచ్చే లబ్దికి చెల్లుచీటి పాడాల్సి వస్తుందనీ హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు లోంగే భారత దేశం కూడా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో వెనకడుగు వేసింది. చైనా విషయానికి వస్తే హాంకాంగ్‌లో చైనా ప్రవేశపెట్టాలనుకున్న రక్షణ చట్టాన్ని అమెరికా వ్యతిరేకించింది. అమెరికా తన గడ్డ పై చైనా నిఘా పెట్టిందని ఆరోపిస్తోంది. దీనికి సాక్ష్యంగా ఒక గూఢాచారిని పట్టుకుంది.  తాను చైనా కోసం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నానని సింగపూర్‌కు చెందిన ఆ వ్యక్తి అమెరికా కోర్టులో  అంగీకరించాడు. ఇతను అమెరికాలో పోలిటికల్‌ ‌కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని అగ్రరాజ్య అధికారులు చెబుతున్నారు. అంతే కాదు మిలటరీ అధికారులుగా చెప్పుకుంటూ వీసా మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు చైనీయుల పై అమెరికా కేసులు నమోదు చేసింది.

వీరిలో జువాన్‌ ‌తాంగ్‌ అనే మహిళకు చైనా ఆర్మీలో పని చేస్తుందన్నది అమెరికా ఆరోపణ. ఆమెను కాలిఫోర్నియాలో అరెస్ట్ ‌చేశారు. శాన్‌ ‌ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌ ఆమెకు ఆశ్రయిచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని అమెరికా అంటోంది. అమెరికావి అనుమానాలా? చైనా నిజంగా నిఘా అస్త్రాలను ప్రయోగిస్తుందా అన్నది మనం తేల్చలేం. కరోనా విషయంలోనూ ఇరు దేశాలు ఒకరి పై వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం చూశాం. వైరస్‌ ‌వ్యాప్తికి చైనాయే కారణమని, వూహాన్‌ ‌నగరంలోని ఓ ల్యాబ్‌లో సృష్టించారని ట్రంప్‌ ‌ధ్వజమెత్తటం, అమెరికా సైన్యమే తమ దేశంలోకి ఈ వైరస్‌ను తెచ్చి ఉంటుందని చైనా తిరిగి అటాక్‌ ‌చేసేది. షిన్‌జియాంగ్‌ ‌ప్రాంతంలో వీగర్‌ ‌ముస్లింలను అణచివేతకు గురి చేస్తున్నారన్న ఆరోపణలతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఒళ్లు మండిన డ్రాగన్‌ ‌మా దేశ వ్యవహారాలలో అమెరికా కలుగ జేసుకోవడమేమిటని నిలదీసింది. రెండేళ్ల క్రితం 2018లో కూడా రెండు దేశాల మధ్య పన్నుల యుద్ధం నడిచింది.

ఎన్నికల కోసమేనా?
రెండు బలమైన దేశాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ ‌వార్‌ ‌లాంటి వాతావరణం నిజంగానే సంబంధాలు చెడి ఏర్పడిందా లేకా మరేవో ఇతర ప్రయోజనాల కోసం పరిస్థితులను అలా మలుచుకుంటున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్ళ నుంచి ట్రంప్‌ అమెరికా కోసం ఏం చేశాడో ప్రజలకు వివరించాల్సిన సందర్భం. కరోనా కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం ఒడిదుడుకులకు లోనయ్యింది. అమెరికా కూడా మినహాయింపు కాదు. తర్వాత కరోన కరాళ నృత్యం.  కరోనా వేళ ట్రంప్‌ ‌నోటికి తాళం లేకుండా పోయింది. పరిస్థితులు చేయి దాటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే స్థితి వచ్చింది. కరోనా కేసులు, మరణాల్లో ఇప్పటికీ అమెరికానే ప్రపంచంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీనితో ప్రజా వ్యతిరేకత బాగా మూటకట్టుకున్నట్లు అయ్యింది ట్రంప్‌కు. ఈ ప్రభావం త్వరలో జరుగనున్న ఎన్నికల పై పడుతుంది. తనకు డ్యామేజ్‌. అయ్యే విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికే ట్రంప్‌ ‌వ్యూహాత్మకంగా చైనాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే కొంత మంది అనుమానిస్తున్నారు. ఫలితంగా తన పాలనా వైఫల్యాలు కప్పి పుచ్చుకుని, జాతీయత, దేశభక్తి, చైనాతో వార్‌ అనే సేఫ్‌ ‌గేమ్‌ను మొదలు పెట్టవచ్చన్నది ట్రంప్‌ ‌వ్యూహంగా భావిస్తున్నారు.    తాజా ఘీంకారాలు కూడా ఇదే కోవలోవి అయితే అనుకున్న లక్ష్యానికి చేరుకున్న తర్వాత చెట్టాపట్టాలేసుకుని మీడియా ఫోటోలకు ఫోజులిచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు.

Leave a Reply