- పాల్గొన్న 40 వేల మంది కార్మికులు.. నిలిచిపోయిన రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
- యాజమాన్యం 53 కోట్లు, 20 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోయిన కార్మికులు
కేంద్ర ప్రభుత్వం ( బీజేపీ) అనుసరిస్తున్న నూతన బొగ్గు విధానాలను వ్యతిరేకిస్తూ బొగ్గుగని కార్మికుల సమ్మె మొదటి రోజు విజయవంతం అయింది. రాష్ట్రంలో సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న 6 జిల్లాలోని 11 డివిజన్లలో దాదాపు 40 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా సుమారు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. యాజమాన్యం కు 53 కోట్ల రూపాయలు నష్టం కాదా కార్మికులు సుమారు 20 కోట్ల రూపాయల వేతనాలను నష్టపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ఖమ్మం భదాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి పెద్ద పెళ్లి మంచిర్యాల కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మణుగూరు టు భూపాల్ పల్లి రామగుండం శ్రీరాంపూర్ మందమర్రి రామకృష్ణాపూర్ బెల్లంపల్లి కూడా గోలేటి తదితర డివిజన్లలో సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది కార్మికులు గురువారం ఉదయం నుండే డ్యూటీ లను బహిష్కరించారు. కార్మిక నాయకులు బొగ్గు గనులపై తిరిగి ప్రచారం చేశారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పరిశ్రమలను పూర్తిగా ప్రైవేటు వారికి బొగ్గు బ్లాకులను అమ్మె విధానాన్ని కార్మిక సంఘాలు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో ఉన్న ఎనిమిది బొగ్గు ఉత్పాదక సంస్థలు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రైవేటు యాజమాన్యం ప్రోత్సహిస్తూ వారికి 50 వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యను కార్మిక రంగం వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది .ఇప్పటివరకు దేశంలో కోల్ ఇండియా ఆధీనంలో ఎనిమిది ఉత్పాదక సంస్థల కొనసాగుతకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు జాతీయ కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు నిరసనను ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే కార్మిక సంఘాల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పోరాటంలో భాగంగానే కేంద్ర కార్మిక సంఘాలు ఐ ఎన్ టి యు సి , ఏ ఐ టి యు సి ,హెచ్ ఎం ఎస్ ,బి ఎం ఎస్,సి ఐ టి యు,తదితర సంఘాలు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది కార్మికులు మొదటి రోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమ్మెకు తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థలో జాతీయ కార్మిక సంఘాలకు తోడు సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, మద్దతు ప్రకటించగా ఐ.ఎఫ్.టి.యు, ఏ ఐ సి టి యు ,కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె ప్రశాంతంగానే జరుగుతుందని సమ్మె వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వం కు కనువిప్పు కలగాలి..
దేశవ్యాప్తంగా జరుగుతున్న బొగ్గు గనుల కార్మికుల సమ్మె కార్మికులు నిరసన ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. బొగ్గు పరిశ్రమల్లో పారిశ్రామిక అశాంతికి కారణమైన విధానాలను బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమ్మె విరమింప చేయాలని ఐ ఎన్ టి యు సి ,కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్. ఏ ఐ టి యు సి కార్యదర్శి సీతారామయ్య. హెచ్ ఎం ఎస్ కార్యదర్శి రియాజ్ అహ్మద్. బి ఎం ఎస్ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య. సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమింప చేసుకొని కార్మికుల సమ్మె విరమింప చేయాలని వారు డిమాండ్ చేశారు.