Take a fresh look at your lifestyle.

సిఎన్. రావు మృతి ఫోటో జర్నలిజానికి తీరని లోటు తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం

CN. Rao's death photojournalism Telangana state photojournalists association
హిమాయత్ నగర్, ఫిబ్రవరి 22 (ప్రజాతంత్ర విలేఖరి): ఢిల్లీలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ సిఎన్. రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమల్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కోడం నరహరి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలియజేసారు.ఆయన మృతి  ఫోటో జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు.
కీలకమైన హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలలో  ప్రధాన దిన పత్రికల్లో గత 40 ఏళ్లుగా ఫోటో జర్నలిస్ట్ గా పనిచేస్తూ విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. సిఎన్. రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Leave a Reply