Take a fresh look at your lifestyle.

ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్న సిఎంలు

ఇద్దరు అలయ్‌ ‌భలయ్‌ ‌చేసుకున్న తీరు అందరికీ తెలుసు
పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టి .. జగన్‌కు అవకాశం ఇచ్చారు
వీరి నటన రావుగోపాలరావు, అమ్రిష్‌ ‌పురిలను మించింది
హుజూరాబాద్‌ ‌కోసమే కెసిఆర్‌ ‌జల డ్రామాలు
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, ‌కేసీఆర్‌లు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. వారిద్దరూ రావుగోపాల్‌ ‌రావు.. అమ్రిష్‌ ‌పురి నటనను మించి నటిస్తున్నారన్నారు. జల జగడం .. ఓ పెద్ద డ్రామా అని చెప్పారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, ‌జగన్‌ల రాజకీయ నాటకాలకు ప్రజలు బలికావొద్దని చెప్పారు. ప్రజలు ఎక్కడికక్కడ గల్లా పట్టి అడగాలన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్‌ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కృష్ణ బేసిన్‌లో ఉండే ప్రాజెక్టస్ ‌పూర్తి చేసేవారన్నారు. అలా చేస్తే జగన్‌ ‌జల దోపిడీ చేసినా తెలంగాణకు ఏవి• ఇబ్బంది ఉండేది కాదని దాసోజు శ్రవణ్‌ ‌పేర్కొన్నారు.

నదీ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే డ్రామా చేస్తున్నారని శ్రవణ్‌ ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌, ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా రెండు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. నేతల మధ్య నడుస్తున్న జల జగడం అంతా పెద్ద డ్రామా అన్న విషయం గతంలో జరిగిన విషయాలను గమనిస్తే అర్థమవుతుంది. రాయలసీమకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ ‌రతనాల సీమ చేస్తాన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ ‌జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్‌ ‌డబ్బులు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్‌ ‌పిలిచారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా కేసీఆర్‌ ‌కాళ్లకు మొక్కారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. జగన్‌, ‌కేసీఆర్‌ ‌డ్రామాలకు ఎవరూ బలికావొద్దని కోరుతున్నా. ఒకరికొకరి స్వీట్లు తినిపించుకున్న కేసీఆర్‌, ‌జగన్‌లు ఇప్పుడే ఎందుకు డ్రామాలు ఆడుతున్నారో గుర్తించాలి.

ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్‌ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఈ డ్రామాలని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఎపీ ప్రభుత్వం సంగమేశ్వరంపై జీవో ఇచ్చి రెండేండ్లు గడిచి పోయిందని దాసోజు శ్రవణ్‌ ‌గుర్తు చేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్‌కు చిత్త శుద్ధి ఉంటే కృష్ణా నదీ బేసిన్‌లో ఉండే ప్రాజెక్టస్ ‌పనులన్నీ పూర్తి చేసేవారని, అలా చేస్తే జగన్‌ ‌జల దోపిడీ చేసినా తెలంగాణకు ఎటువంటి ఇబ్బందీ ఉండేదికాదని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 20 ‌శాతం పూర్తి కాకుండానే కేసీఆర్‌ ‌సర్కారు వంద శాతం ఎస్టిమేట్స్ ‌పెంచిందని, పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్‌ ‌జల దోపిడీ చేయక పోతే కేసీఆర్‌కు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే అవకాశం ఉండదని, అందుకే కృష్ణా బేసిన్‌ ‌ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, జగన్‌కు జల దోపిడీ చాన్స్ ఇచ్చారని దాసోజు ఆరోపించారు. దీంతో ఇద్దరు సీఎంలూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌, ‌కేసీఆర్‌ల డ్రామాలకు ప్రజలు మోసపోవద్దని, ఎక్కడికక్కడ గల్లా పట్టి అడగాలని సూచించారు.

Leave a Reply