Take a fresh look at your lifestyle.

విశ్వసనీయత కోల్పోతున్న సి.యం.కేసీఆర్

తెలంగాణ ఉద్యమకాలంలో టిఆర్ఎస్ అధినేతగా చూసిన కేసీఆర్ కు నేడు రెండో పర్యాయం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి హోదాలో చూస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎంతో తేడా కనిపిస్తోంది. నాడు ఉద్యమంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటకు పదును ఎక్కువ.. తిరుగు ఉండేది కాదు. “కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో, చావు నోట్లో తల పెట్టి అయినా తెలంగాణ తెస్తా, కేసీఆర్ తల కోసుకుంటడు తప్ప ఇచ్చిన మాట తప్పడు “అని ఉద్యమసమయంలో ఆయన చెప్పిన మాటలు రాష్ట్ర సాధన పరిణామంతో నిజామయ్యాయి.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

కానీ ఎందుకో ప్రభుత్వం ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గద్దెనెక్కించాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న శైలిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం అని చెప్పకతప్పదు. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సిఎం పర్యటన చివరి నిమిషంలో రద్దు అయిన నేపథ్యంలో గతంలో ఆయన జిల్లాల పర్యటనల రద్దు, పలు పర్యటనల్లో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు నోచుకోని వైనం మళ్ళీ ఒక్కసారి చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట, హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గాల్లో వడగళ్ళతో కూడిన అకాల వర్షాలకు మిర్చి, మక్కజొన్న, పసుపు, పప్పు ధాన్యాల పంటలు, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు.

బాధిత రైతులను పరామర్శించి పంట నష్టాలను స్వయంగా తానే పరిశీలిస్తానని సోమవారం జరిగిన కేబినెట్ భేటీ సందర్బంగా సిఎం కేసీఆర్ ప్రకటించడంతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం యావత్తు అలర్ట్ అయ్యారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. తీరా అర్ధరాత్రి పర్యటన రద్దు అయింది.. వ్యవసాయశాఖ మంత్రి, కార్యదర్శి, జిల్లా మంత్రులు, రైతు బంధు సమితి చైర్మన్ పంట నష్టం అంచనాకు వస్తారని మంగళవారం ఉదయం సమాచారం రావడంతో అధికార యంత్రాంగం అవాక్కయింది. పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు. రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పలకరిస్తే గోడు చెప్పుకుందామనుకున్నా మని, నష్టపరిహారం అప్పటికప్పుడే ఇస్తారనుకున్నా మని.. చివరికి అంతా ఉత్తదే అయిందని పలువురు బాధిత రైతులు వాపోయారు. మా సారు పర్యటన ఖరారు కావడం, రద్దు కావడం కొత్తేమి కాదని, సారు వచ్చేదాకా నమ్మకం ఉండదని గతంలో వరంగల్,పర్యటన,జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా లను ఆ పార్టీ కార్యకర్తలే ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ సీఎం అయ్యాక తీసుకుంటున్న హడావిడి నిర్ణయాలు చాలా వరకు ఆయన విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నాయి అనడంలో సందేహం లేదనిపిస్తోంది.మంగళవారం మంత్రుల బృందం పర్యటన వరకు బాగానే ఉన్నా బాధిత రైతులకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిందే.

బలేరావు బాబ్జీ
సీనియర్ జర్నలిస్ట్
పరకాల (హనుమకొండ జిల్లా )9849777792

Leave a Reply