Take a fresh look at your lifestyle.

వరద బాధితుల ఇంటికే సిఎం రిలీఫ్ కిట్

*కిట్‌లో రూ. 2,800 విలువైన నిత్యావ‌స‌రాలు, 3 బ్లాంకెట్లు
*హైద‌రాబాద్ న‌గ‌రంలో సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లు

*జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మీక్ష నిర్వ‌హించిన  మంత్రి కె.టి.ఆర్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల ముందున్న సాదార‌ణ స్థితికి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి దిశానిర్ధేశం చేశారు. ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆదేశాల మేర‌కు ఇస్తున్న సి.ఎం రిలీఫ్ కిట్‌ల‌ను వ‌ర‌ద బాదిత కుటుంబాల ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి అంద‌జేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రూ. 2,800 విలువ గ‌ల సి.ఎం రిలీఫ్ కిట్‌లో ఒక నెల‌కు స‌రిప‌డ నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చే అన్ని చ‌ర్య‌ల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అందుకు స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని తెలిపారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహార‌క ద్రావ‌నాల‌ను  అన్ని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పిచికారి  చేయించాల‌ని ఆదేశించారు. ఎంట‌మాల‌జి బృందాల ద్వారా కెమిక‌ల్స్ స్ప్రే చేయించాల‌ని సూచించారు. స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌, స్ప్రేయింగ్‌కు అవ‌స‌ర‌మైతే అద‌నంగా వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో నిలిచిన నీళ్ల‌ను తొల‌గించుట‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నాలాలు, రోడ్ల‌పై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బుర‌ద‌ను, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply