రైల్వే బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వనమా
సిద్ధిపేట, ఆగస్టు 7 (ప్రజాతంత్ర బ్యూరో): కష్టాల్లో ఉన్న వారికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేసే సహాయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా శనివారం…కృత్రిమ కాలు ఏర్పాటుకు సహాయం చేశారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని గొల్లపల్లికి చెందిన జొన్న నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు.
కాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న సమాచారం తెలుసుకున్న జగదేవ్‌పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గూండా రంగారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. నర్సింహారెడ్డి ఇబ్బందిని అర్థం చేసుకున్న మంత్రి హరీష్‌రావు తక్షణమే స్పందించి కృత్రిమ కాలు ఏర్పాటుకుగానూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కృత్రిమ కాలు ఏర్పాటుకు సహాయం చేసిన మంత్రి హరీష్‌రావుకు ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, బాధితుడు జొన్న నర్సింహారెడ్డి మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మాజీ సర్పంచ్ నాచారం మహేందర్ గౌడ్, వంటేరు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.