Take a fresh look at your lifestyle.

ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన సిఎం కేసీఆర్‌

అమరవీరులకు సిఎం నివాళి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న వేళ…ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు ప్రగతి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్రంలో కూడా రిపబ్లిక్‌ ‌డేను కొరోనా నిబంధనల మధ్య జరుపుకుంటున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గర్తుచేసుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌, ‌సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌..73‌వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌ ‌గ్రౌండ్‌లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply