Take a fresh look at your lifestyle.

దిల్లీ లో కొరోనా ఉధృతి.. 28 వేల పాజిటివ్ కేసులు సీ ఎం కెజ్రీవాల్ అస్వస్థత

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: రాజధానిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 28,000 దాటింది, తాజాగా నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 1,282 ..ఇక కరొనతో మరణించిన వారి సంఖ్య 812 కు చేరుకుందని ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్ తెలిపింది. ఈ పరిస్థితి రిపోర్ట్ రాస్తున్న సమయంలో ఉండగా.. మరో వైపు ఢిల్లీ ముఖ్య మంత్రి గొంతు నొప్పి చిన్నపాటి జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఆమాద్మీ మీడియా ప్రతినిధి వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా కోవిద్ టెస్ట్ చేయించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కరోనా కాలంలో ఢిల్లీ ప్రభుత్వం పనితీరు ఎలా వుంది చూద్దాం..ఢిల్లీ ప్రభుత్వం ఐదు ప్రభుత్వ హాస్పిటల్ లో మూడు ప్రైవేట్ హాస్పిటల్స్ ను కోవిద్-19 హాస్పిటల్ గా మలిచింది. ఇవికాకుండా మరో 61 ప్రైవేట్ హాస్పిటల్ లను ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొవిడ్-19 హాస్పిటల్స్ గా మలచింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ హాస్పిటల్స్ ఒక్కొక్కటి సుమారు 70 బెడ్లు కలిగి ఉన్నాయి. వీటిలో 20% covid19 పేషెంట్ల కోసం వెచ్చించే లాగా ఢిల్లీ ప్రభుత్వం చూసింది. ఏ హాస్పిటల్ అయినా 20% బెడ్లు ఇవ్వకపోతే మొత్తం హాస్పిటల్లోనే కరోనా హాస్పిటల్ చేస్తామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు కూడా. ఇదిమాత్రమే కాకుండా ఈ నెల రెండవ తారీకున ఢిల్లీ ముఖ్యమంత్రి కరోనా యాప్ లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఢిల్లీ వాసులకు ఏ హాస్పిటల్లో లో కరోనా బెడ్ లభ్యమవుతున్నయో మొబైల్ ఫోన్ ద్వారా తెలుస్తుంది అని చెప్పారు. ఈ యాప్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు అప్డేట్ అవుతూ ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ యాప్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే తే హాస్పిటల్స్ లిస్ట్.. అలాగే హాస్పిటల్స్ లో లభ్యమవుతున్న బెడ్స్ సంఖ్యా కనిపిస్తాయి. ఇంతవరకు పేపర్ పైన అంత బాగుంది.

వాస్తవికతలో చూసినప్పుడు కోవిద్ హాస్పిటల్ కి ఫోన్ చేసి చూస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ కారు. ఒకవేళ రెస్పాండ్ అయిన బెడ్ ఖాళీగా లేవని చెబుతారు. ఈ నెల జూన్ రెండవ తారీకున అమర్ప్రీత్ అనే మహిళ తన తండ్రికి కరోనా సోకిందని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నుంచి ఎటువంటి సహాయం దొరకలేదు. జూన్ 4వ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు తాను..తండ్రిని తీసుకొని ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ ఎల్ఎన్జెపి దగ్గర నిలబడి ఉన్నానని.. తన తండ్రిని హాస్పిటల్ లోకి రానివ్వడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అక్కడికి ఒక గంట తర్వాత తన తండ్రి మరణించారని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సంఘటనతో ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ కరోనా రోగులకు ఏ తీరుగా సేవలు అందిస్తున్నదీ ఢిల్లీ వాసులకు ఒక క్లారిటీ వచ్చింది. “మీకు గనక కరోనా వైరస్ సోకితే భయపడకండి ఒక్క ఫోన్ కొట్టండి ఢిల్లీ హెల్ప్లైన్ మీకోసం పని చేస్తుంది” అని చెప్పిన ఢిల్లీ ముఖ్య మంత్రి మాట నీటి మీద రాత అయ్యింది.ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ అసలు పని చేయటం లేదు. ఢిల్లీ ప్రభుత్వం ఆరోగ్య శాఖ వెబ్ సైట్ కు వెళ్ళి అన్నీ నంబర్లు ట్రై చేసినా కూడా ఒక్కటి పలకదు. ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ కి ఫోన్ చేసినా ఫోన్ ఎవరు ఎత్తని పరిస్థితి.ఇక ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా వైరస్ టెస్టులు జరుగుతున్న చోట కూడా చాలా పెద్ద లైన్లు ఉంటున్నాయి.

మొదట స్క్రీనింగ్ చేసి, ఎవరికి టెస్టు అవసరమనుకుంటే వారికి మాత్రమే టెస్ట్ చేస్తున్నారు టెస్ట్ చేసిన తర్వాత రోగి పరిస్థితి బట్టి హోమ్ కొరెంటైన్ లేదా హాస్పిటల్ కొరెంటైన్ నిర్ణయిస్తున్నారు. ఐతే సమస్య ఏమంటే. ఢిల్లీ అంటే పార్లమెంట్ ఎంపీలు వుండే ల్యూటియన్ జోన్ మాత్రమే కాదు. ఢిల్లీ అంటే జేజే కాలనీలు అని పిలవబడే అసంఘటిత మురికి వాడలు కూడా.. ఢిల్లీ కరోనా వైరస్ కేసులు అత్యధికంగా జేజే కాలనీలు అనే మురికివాడల్లోకి చొరబడ్డాయి. ఒక గది మాత్రమే ఉండే కాలనీలో హోమ్ కొరెంటైన్ కుదరడంలేదు. ప్రస్తుతం ఢిల్లీ మహారాష్ట్ర దాటుతుంది అంటున్నారు. ఇంత జరుగుతుంటే కేంద్ర..ఢిల్లీ ప్రభుత్వం మధ్య సమన్వయం లేదు.. కేంద్ర ఆరోగ్య మంత్రి.. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖా మంత్రి పీసీలు పెట్టుకుని మరీ తిట్టుకుంటున్నారు.. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఆర్ యం ఎల్ హాస్పిటల్ లో టెస్టులు సజావుగా సాగటం లేదని.. టెస్ట్ చేసిన తర్వాత తప్పుడు రిపోర్ట్ వస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆర్ యం ఎల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నవారు, 24 గంటల్లోనే చచ్చిపోతున్నారు అని ఆరోపించారు. అంతేకాకుండా ఆర్ యం ఎల్ హాస్పిటల్ లో జరుగుతున్న టెస్టులో అంతబాగుంది అని చెప్పిన వారిలో తర్వాత టెస్ట్ చేస్తే 40 శాతం మంది కరోనా పాజిటివ్ గా తేలారని ఆరోపించారు.దీనిపై వాస్తవం ఏమిటి అనేది పరిశీలించి.. నిజం ప్రజల ముందు పెట్టకుండా తిట్ల దండకం ఎత్తుకున్నారు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్.

Leave a Reply