Take a fresh look at your lifestyle.

పోడు భూసమస్యలపై సిఎం కెసిఆర్‌ ‌సమిక్ష

సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చ

తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమిక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, అటవీఅధికారులతో పాటు పలువురు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోడు భూముల విషయంలో ఇటీవల జరగిన పరిణామాలపై చర్చించారు.

పోడు భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పటికే కేబినేట్‌ ‌సబ్‌ ‌కమిటీ దీనిపై చర్చించింది. పలు విషయాలను అసెంబ్లీలో కూడా సిఎం కెసిఆర్‌ ‌ప్రస్తావించారు. తాజాగా మరోమారు సమస్య పరిష్కారం కోసం సిఎం సాధ్యాసాధ్యాలను చర్చించారు.

Leave a Reply