Take a fresh look at your lifestyle.

రహదారులకు నిధులు విడుదల చేయండి

  • ఆమోదం పొందిన రోడ్లను పూర్తి చేయండి
  • కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీకి సిఎం కెసిఆర్‌ ‌వినతి
  • కొనసాగుతున్న సిఎం ఢిల్లీ పర్యటన

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ‌సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో రోడ్లు, జాతీయ రహదారుల అంశంపై ఈ సందర్భంగా పలు వినతి పత్రాలు సమర్పించారు. తెలంగాణకు రాష్ట్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధుల కింద 2021 ఏడాదికి రూ. 744 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారని లేఖల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,306 కిలోమిటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని నిర్ణయించారని.. ఇప్పటివరకు 2,168 కిలోమిటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కెసిఆర్‌. ‌మిగిలిన 1,138 రహదారుల్లో 4 రాష్ట్ర అత్యంత ప్రధాన రహదారులు ఉన్నాయని తెలిపారు. ’రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు’లో భాగమైన చౌటుప్పల్‌-‌కంది 182 కిలోమిటర్లు, కరీంనగర్‌-‌పిట్లం 165 కిలోమిటర్లు, కొత్తకోట – మంత్రాలయం 70 కిలోమిటర్లు, జహీరాబాద్‌-‌దేగ్లుర్‌ 25 ‌కిలోమిటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు.

తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్‌, ‌సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని నంద్యాల వరకు ఎన్‌.‌హెచ్‌ 167 ‌కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్‌ ‌జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్‌.. ఈ ‌జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్‌, ‌సోమశిల, ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని ఆత్మకూరు లాంటి వెనుక బడిన ప్రాంతాలకు రహదారి సౌకర్యం సమకూరుతుందన్నారు. హైదరాబాద్‌ ‌నుంచి కల్వకుర్తి మిదుగా శ్రీశైలం వరకు వెళ్లే ఎన్‌.‌హెచ్‌. 765 ‌లో విపరీతమైన ట్రాఫిక్‌ ఉం‌డగా.. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 2 లైన్ల జాతీయ రహదారిగా ఉన్న ఎన్‌.‌హెచ్‌ 765 ‌హైదరాబాద్‌- ‌కల్వకుర్తి మార్గాన్ని 4 లైన్ల రహదారిగా అభివృధ్ది చేయాలని ఈ సందర్భంగా నితిన్‌ ‌గడ్కరీని కోరారు. జాతీయ రహదారి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ రహదారిలో సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న వంతెన వల్ల హైదరాబాద్‌ ‌నుంచి తిరుపతి, చెన్నైల మధ్య దూరం 80 కిలోమిటర్ల మేరకు తగ్గనుంది. ఇక, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మించనున్నట్లుగా కేంద్రం ప్రకటించిన ఈ కొత్త జాతీయ రహదారి కల్వకుర్తి నుంచి ప్రారంభకానుంది..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు. కాగా, ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన కేసీఆర్‌.. ‌గత ఆరు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తో పాటు భేటీకి మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, పలువురు ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షాను కలిసి రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్‌ ‌వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీని సీఎం కేసీఆర్‌ ‌కలిశారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ఆమోదించినందుకు గడ్కరీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply