Take a fresh look at your lifestyle.

సెంట్రల్‌ ‌విస్టా నిర్మాణం దేశానికి గర్వకారణం

  • పటిష్ట భారతానికి చిహ్నంగా నూతన పార్లమెంట్‌ ‌భవనం
  • ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌లేఖ
  • వర్చువల్‌గా పాల్గొంటానని వెల్లడి

దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్‌ ‌విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి కేసీఆర్‌ ‌లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్‌ ‌విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు.

Central‌ Vista architecture is a pride for the country1

సెంట్రల్‌ ‌విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారత దేశానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉందని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. వర్చువల్‌ ‌ద్వారా కొత్త పార్లమెంట్‌ ‌శంకుస్థాపనకు హాజరవు తానని లేఖలో కేసీఆర్‌ ‌వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదీకి కేసీఆర్‌ ‌లేఖ రాయడం చర్చ నీయాంశంగా మారింది.

Leave a Reply