Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యోగులతో సీఎం కేసీఆర్‌ది పేగుబంధం

టీజీవో నేతలు కృష్ణయాదవ్‌, ‌హరికృష్ణ
‌సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సాధనలో స్ఫూర్తివంతమైన పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించడం పట్ల హైదరాబాద్‌ ‌జిల్లా గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బి.కృష్ణయాదవ్‌, ‌టి.హరికృష్ణ హర్షం ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులతో సీఎం కేసీఆర్‌ది పేగుబంధమనీ, ఈ నజరానాతో ఆ బంధం మరింత బలపడిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఉద్యోగుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద సంబరాలు జరిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పొడిగిస్తూ సిపిఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ ‌కల్పించడం, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్సీ లాభాలను అందజేయడం, గ్రాట్యుటీని రూ.16 లక్షల వరకు పెంచడం వంటి నిర్ణయాలు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.

గత అనేక ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ సీఎం కేసీఆర్‌ ఈ ‌పీఆర్సీలో నిర్ణయాలు తీసుకున్నందుకు , ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి శ్రీనివాసగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్‌ ‌జిల్లాలో పనిచేస్తున్న లక్షా యాభై వేల మంది ఉద్యోగులంతా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందేలా పనిచేయాలని ఈ సందర్భంగా కృష్ణయాదవ్‌ ‌కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవో నేతలు అబ్దుల్‌ ‌ఖాదర్‌, ఉపాధ్యక్షులు రవీందర్‌, ‌భాను, గోపాలకృష్న,సురేందర్‌, ‌స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply