Take a fresh look at your lifestyle.

చేతులెత్తి దండం పెడుతున్న ..సహకరించండి ..!

  • విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాల్సిందే
  • వారు ప్రభుత్వానికి సహకరించి టెస్ట్ ‌చేయించుకోవాలి
  • వారికి పాజిటివ్‌ ‌వస్తే ప్రభుత్వ ఖర్చుతోనే వైద్య సేవలు
  • మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌

కొరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించే దాకా ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని .అందుకు చేతులెత్తి దండం పెడుతున్నానని ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. కరోనా విషయంలో కరీంనగర్‌లో కలకలం రేగిన నేపథ్యంలో అక్కడకి వచ్చిన విదేశీయులను గుర్తించి పట్టుకున్నామని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి మరీ వైద్యబృందాలు కరోనా పరీక్షలు చేరని కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ‌వచ్చిన 10 మంది ఇండోనేషియ న్లకు లక్షణాలు ఉన్నాయని.. ఉన్నతాధికారులు పక్క రాష్టాల్రతో నిరంతరం టచ్‌లో ఉన్నారని సీఎం తెలిపారు. ఇండోనేషియన్లు తప్పు చేయలేదని.. కేంద్రం అనుమతి ఇస్తేనే వచ్చారన్నారు.

కరోనా లక్షణాలు ఉంటే 100శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా స్వచ్చందంగా తమ రాకను తెలియచేయాలన్నారు. ఇది వారికి, దేశానికి మంచి దన్నారు. కటుంబ సభ్యులుకూడా సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. పొరుగు దేశాల నుంచి ఎవరూ రాష్ట్రంలోకి వచ్చినా కచ్చితమైన పరీక్షలు చేయించుకోవాల్సిందేనని, తప్పించుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకుంటారని తెలిపారు. కరీంనగర్‌లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్‌ ‌కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్‌ ‌పర్యటన వాయిదా వేసుకున్నాను. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదు. తెలంగాణ పేద రాష్ట్రం కాదు.. అవసరమైతే పేదలకు సరుకులు ఉచితంగా అందిస్తాం.

నేను బతికున్నంత వరకు పేదలకు కష్టం రానివ్వను. నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేసీఆర్‌ ఒకింత వార్నింగ్‌ ఇచ్చారు. కేవలం 24 గంటలు ఇళ్లకు పరిమితం కావాలని, దీనిపై తెలంగాణ ప్రజలు నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరారు. పరిస్థితి చేయిదాటితే మొత్తం షట్‌డౌన్‌ ‌చేస్తామని కూడా కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇకపోతే భక్తులకు అనుమతి లేకున్నా ఆలయాల్లో నిత్యపూజలు కొనసాగుతున్నాయన్నారు. అవసరమైతే తీవ్ర పరిస్తితులే వస్తే ఖర్చుకు వెనకాడకుండా నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వమే ఇంటింటికి సరఫరా చేస్తుందన్నారు.

Leave a Reply