Take a fresh look at your lifestyle.

రేపు పోలీస్‌ ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ

శాంతిభద్రతలతో పాటు పలు అంశాలపై చర్చ
‌రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ రేపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విస్తృతస్తాయి సమావేశాన్ని నిర్వహించ నున్నారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఉదయం 11.30గంటలకు జరిగే ఈ సమావేశంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్‌

అరికట్టడం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చర్చించనున్నారు. అలాగే అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. హోంశాఖ, అటవీశాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అడిషనల్‌ ‌డీజీపీలు, ఐజీలు, డిఐజీలు, పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Leave a Reply