Take a fresh look at your lifestyle.

సీఎం కెసీఆర్ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు గాను గడచిన ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న “తెలంగాణకు హరితహారం” కార్యక్రమం సాధిస్తున్న ఘనతను సీఎం గుర్తు చేసుకున్నారు.

పచ్చదనాన్ని అభివృధ్ధి పరిచే కృషిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. హరిత యజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సీఎం అభినందించారు.

Leave a Reply