Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్‌, ‌సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌:‌ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌శనివారం సాయంత్రం హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్‌ ‌విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి దంపతులు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌ ‌చేరుకున్నారు. రాత్రి రాజ్‌ ‌భవన్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని ధ్యానకేంద్రాన్నిరాష్ట్రపతి దంపతులు సందర్శిస్తారు. అనంతరం 10.20 నిమిషాలకు తిరిగి బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు. ట్రాఫిక్‌ ‌పోలీసులు సూచించిన ప్రకారం వాహనదారులు వెళ్లాలని సూచించారు.

Leave a Reply