Take a fresh look at your lifestyle.

నేడు యాదాద్రికి సిఎం కెసిఆర్‌

  • ‌పునర్నిర్మాణాల పనుల పరిశీలన
  • ఆలయ పున: ప్రారంభం తేదీలను స్వయంగా ప్రకటించనున్న సిఎం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11.30 కు హైద్రాబాద్‌ ‌నుంచి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నిటినీ మరోసారి కేసీఆర్‌ ‌పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌ ‌స్వామివారు నిర్ణయించి ఉన్నారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను స్వయంగా అక్కడే సిఎం ప్రకటించనున్నారు.

పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా కేసీఆర్‌ ‌ప్రకటించనున్నారు. ఈ మేరకు సిఎం రాక సందర్భంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అలాగే యాదాద్రి పనులను పరిశీలనలో సిఎంతో పాటు అధికారులు పాల్గొంటారు.

Leave a Reply