Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ గాంధీ హాస్పిటల్ సందర్శన

  • కొరోనా చికిత్సలపై ఆరా
  • వార్డులను స్వయంగా పరిశీలించి పేషెంట్లకు పలకరింపు
  • అందుతున్న వైద్య సేవలు, వసతులపై వివరాలు సేకరణ
  • సిఎం వెంట మంత్రి హరీష్‌ ‌రావు, ఉన్నతస్థాయి అధికారులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బుధవారం మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్‌ ‌ని సందర్శించి కొరోనా చికిత్సలపై ఆరా తీసారు. కోవిడ్‌ ‌వార్డులను స్వయంగా పరిశీలించారు. సీఎం •దాలో మొదటిసారి ఆయన గాంధీ హాస్పిటల్‌కి వచ్చారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌ ‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే పేషెంట్లతో కూడా కేసీఆర్‌ ‌మాట్లాడారు. హాస్పిటల్‌లో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గాంధీ హాస్పిటల్‌లో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను సీఎం పరామర్శించి వసతులపై మాట్లాడారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాక.. కొవిడ్‌ ‌బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. హాస్పటల్లో కొవిడ్‌ ‌చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించి ఆయన స్వయంగా విషయాలను తెలుసుకున్నారు.

ఐసీయూ వార్డులోకి సీఎం కేసిఆర్‌ ‌వెళ్లి ముఖ్యమంత్రి నేరుగా కొవిడ్‌ ‌రోగులను పరామర్శించారు. రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్‌ అభినందించారు.ఈటెల రాజేందర్‌ను తప్పించిన తరవాత  ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం స్వయంగా వైద్యానికి సంబంధించిన అంశాలను ఆయన సక్ష చేస్తున్నారు. కాగా కొరోనా పేషంట్ల విషయంలో సీఎం కేసిఆర్‌ ‌వ్యవహర శైలిపై ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నారు. కనీసం ఆయన బయటకు రాకుండా ఉంటున్న తీరును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ ‌సందర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలావుంటే సీఎం కేసీఆర్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌సందర్శన  నేపథ్యంలో పరిసరాల్లో ఆంక్షలు కఠినం చేశారు.

గాంధీ వద్ద పోలీసులతో కొరోనా పేషంట్‌ ‌బంధువుల వాగ్వాదానికి దిగారు. సీఎం విజిట్‌ ‌నేపథ్యంలో పేషంట్‌ అటెండర్లను పోలీసులు బయటకు గెంటివేసారు. డెడ్‌బాడీలను కూడా తీసుకు వెళ్ళనివ్వకుండా హాస్పిటల్‌ ‌లోపలికి అనుమతి ఇవ్వడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గాంధీ పరిసరాల్లో ఉన్న వారిని రెండు కిలోటర్ల బయట వరకు పోలీసులు పంపించివేసారు.

కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గాంధీ హాస్పిటల్‌ ‌వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ హాస్పిటల్‌ ‌ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.

Leave a Reply