Take a fresh look at your lifestyle.

వరంగల్ ఎంజీఎం సందర్శించిన సి ఎం కేసీఆర్

ఎంజీఎం హాస్పిటల్  లో కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి ముఖ్యమంత్రి  కేసీఆర్  రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కొరోనాకు భయపడవద్దంటూ  ధైర్యం చెప్పారు. వరంగల్ మట్టెవాడకు చెందిన కొరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కొరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.  అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.  ఎంజీఎం హాస్పిటల్లో  సౌకర్యాలను పరిశీలించారు.

వైద్య సౌకర్యాలు,రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్  లో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM KCR visited by Warangal MGM

ఈ పర్యటనలో  సీఎం కేసీఆర్  వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సిఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ రమేష్ రెడ్డి, ఓఎస్ డీ  గంగాధర్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాదికరులు, సీపీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు.

Leave a Reply