Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లపై సిఎం కెసిఆర్‌ అత్యవసర సమిక్ష

ప్రగతిభవన్‌లో ఎంపిలు, మంత్రులు, అధికారులతో చర్చ
ధాన్యం సేకరణ, కేంద్ర విధానాలపై సిఎం కెసిఆర్‌ అత్యవసరంగా మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎం‌పీలతో ప్రగతిభవన్‌లో శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సవి•క్ష నిర్వహించారు. ఐదు రోజులుగా పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేస్తూ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పార్లమెంట్‌ ‌సమావేశంలో కేంద్రం స్పందించిన తీరుపై.. శనివారం సీఎం కేసీఆర్‌ ‌మంత్రులు, ఎంపీలతో సమావేశం జరుపడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి కార్యారణపై చర్చించడంతో పాటు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ఎం‌పీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు చేస్తున్న ఆందోళనకు లోక్‌సభలో మెజారిటీ విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. టీఎంసీ, బీజేడీ, కాంగ్రెస్‌, ‌డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ సహా తొమ్మిది విపక్ష పార్టీలు లోక్‌సభ సాక్షిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply