Take a fresh look at your lifestyle.

రేపు వరంగల్‌ ‌జిల్లాలో సిఎం కెసిఆర్‌ ‌పర్యటన

పలు అభివృద్ది పనులపై సమీక్ష.. మంజూరు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు హన్మకొండ, వరంగల్‌ ‌జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులు చేస్తున్న వినతుల మేరకు, స్ధానిక ప్రజల కోరిక మేరకు వరంగల్‌ ‌సౌత్‌ ‌భాగంగా ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, వరంగల్‌ ‌జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్‌, ‌హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ల మీద రైల్వే ఓవర్‌ ‌బ్రిడ్జి(ఆర్‌ ఓబి)ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, పనులు మంజూరు చేయనున్నారు.

వరంగల్‌ ఇం‌టర్నల్‌ ‌రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్ట వలసిన చర్యలపైనా, వరంగల్‌ ‌టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌పనుల పరోగతి అంశాలను సీఎం కేసీఆర్‌ ‌సమీక్షించనున్నారు. అలాగే హన్మకొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్‌ అదే రోజు ప్రారంభించనున్నారు.

Leave a Reply