Take a fresh look at your lifestyle.

ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్‌ 50 ‌నిముషాలపాటు చర్చ

  • వివిధ అంశాలపై వినతిపత్రం
  • ఐపిఎస్‌ల సంఖ్య పెంపు సహా అనేక అంశాలపై వివరణ

ప్రధాని నివాసంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ అయ్యారు. వివిధ అంవాలపై ఆయన దాదాపు 50 నిముషాలపాటు చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోదీకి కేసీఆర్‌ ‌వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఐపీఎస్‌ల సంఖ్యపెంపు, కొత్త జిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్‌-‌నాగ్‌పూర్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌కారిడార్‌ ‌ప్రధాన అంశాలుగా ఉన్నాయి. పీఎంజీఎస్‌వైకి అదనపు నిధులు కేటాయింపు, కొత్త జిల్లాలకు జవహర్‌ ‌నవోదయ విద్యాలయాలను కేటాయించాలని మోదీతో విన్నవించారు.

తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ ‌పార్క్‌కు రూ.1,000 కోట్లు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా కేసీఆర్‌ ‌కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వీటికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజనకు అదనపు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన లేఖలను మోదీకి కేసీఆర్‌ అం‌దజేశారు.

Leave a Reply