Take a fresh look at your lifestyle.

రంగనాయకసాగర్‌ ‌గెస్ట్‌హౌజ్‌లో అన్నం తింటుంటే…

సిద్ధిపేట లేకుంటే కేసీఆర్‌ ‌లేడు…కేసీఆర్‌ ‌లేకుంటే తెలంగాణనే లేదు
త్వరలో జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం
సిద్ధిపేటపై వందల కోట్ల వరాల జల్లు కురిపించిన సిఎం కేసీఆర్‌

ఒకనాడు తాగు, సాగు నీటి కోసం అరిగోస పడ్డాం. కరంటు ట్రాన్స్‌ఫార్మర్లు పటాసులలా పేలిపోతూండేవి. నీళ్ల కోసం, కరంటు కోసం పడరాని  బాధలు పడ్డాం. నాలుగైదు బోర్లు వేసినా నీళ్లు పడేవి కావు. పోటీపడి బోర్లు, సైడ్‌ ‌బోర్లు వేసేటోళ్లు. అయినా నీళ్లొచ్చేవి కావు.  అయితే, తెలంగాణ వచ్చాక ఆ కష్టాలన్నీ తొలిగిపోయాయి. ఇంటింటికీ తాగునీటిని ఇస్తున్నాం. కాలేశ్వరం, రంగనాయకస్వామి దయవల్ల సాగునీటిని కూడా ఇస్తున్నాం. ఇక కరంటు ఇతరులకు సరఫరా చేసే స్థాయికి వచ్చినం. ఇయ్యాల  రంగనాయకసాగర్‌ ‌జలాశయం మధ్య నిర్మించిన అతిథి గృహంను ప్రారంభించాక అన్నం తింటుంటే ఒళ్లు పులకరించింది.

కండ్లల్లో నీళ్లు తిరిగినయి. ఒకనాడు సిద్ధిపేటలో నీళ్లకు, కరంటుకు ఎన్ని బాధలు పడ్డాయో అన్ని కండ్ల ముందర తిరిగాయనీ, ఇప్పుడు చూస్తే పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయన్నారు. సిద్ధిపేటను చూసిన తర్వాత గుండెల నిండా సంతోషంగా ఉందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదనంలో ఏర్పాటు చేసిన సభలో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ… ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే అగుపిస్తున్నాయన్నారు. కరంటు సమస్య అసలే లేదన్నారు. ఇంతకంటే ఏం కావాలన్నారు. సిద్ధిపేట పేరులోనే ఏదో బలం ఉందనీ, సిద్ధిపేట మామూలు పేట కాదన్నారు. తెలంగాణను సిద్ధింపజేసి గడ్డ సిద్ధిపేట అన్నారు. సిద్ధిపేట లేకుంటే కేసీఆర్‌ ‌లేడనీ…కేసీఆర్‌ ‌లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదన్నారు.  సిద్ధిపేట అంటే నాకెంతో ప్రాణం, బలహీనత కూడా అన్నారు. నా కలలన్నీ నెరవేరాయన్నారు. ఆనాడు అవసరం రీత్యా కరీంనగర్‌ ఎం‌పీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేస్తే రెండింటిలో గెలిచాను. కానీ, తెలంగాణ కోసం ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ కోసం నడుం కట్టి మిమ్మల్ని అందరినీ వదిలి అక్కడికి పోయిన. మీ పేరు నిలబెట్టి తెలంగాణ తెచ్చి ప్రజల చేతులో పెట్టాం. తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీష్‌రవును  మీకు అప్పగించా. నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేట తయారు చేశాడు. ఇది తన గుండెల నిండా సంతోషం నింపే అంశమని సిఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అదనంగా సమీప భవిష్యత్‌లో సిద్దిపేట సమీపంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కొలువుదీరే అవకాశం ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply