Take a fresh look at your lifestyle.

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌తెలంగాణ రాష్ట్ర 2021 22 వార్షిక బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాఖల వారీగా ఏ శాఖకు ఎంత బడ్జెట్‌ను కేటాయించాలి ? గత ఏడాది కేటాయించిన నిధులు ఎంత ? అనే అంశాలపై సీఎం కేసీఆర్‌ ఈ ‌సమావేశంలో చర్చించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌సైతం ప్రభుత్వ ప్రధాన్య రంగాలకు వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధుల ప్రతిపాదనలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. అయితే, ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే, సమావేశంలో బడ్జెట్‌ ‌నిర్వహించే తేదీలను సైతం ఖరారు చేసే అవకాశం ఉంది.

Leave a Reply