Take a fresh look at your lifestyle.

పాలమూరు ప్రాజెక్టులకు లైన్‌ ‌క్లీయర్‌ ‌చేయండి

  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ‌షెకావత్‌కు సిఎం కెసిఆర్‌ ‌వినతి
  • కృష్ణా, గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చ

పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ‌షెకావత్‌ను సీఎం కెసిఆర్‌ ‌కోరారు. కేఆర్‌ఎం‌బీ, జిఆర్‌ఎం‌బీ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌• అభ్యంతరాలపై, వాయిదా వేసే అంశంపై కూడా కేసీఆర్‌ ‌చర్చించారు. కేంద్ర మంత్రి షెకావత్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శనివారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. నలబై నిముషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటుగా మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా ప్రజా ప్రతినిధులు లక్ష్మారెడ్డి, రాజేందర్‌ ‌రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా పలు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం నుంచి సహకారం కోరారు.

అలాగే పాలమూరు జిల్లా రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకి జరుగుతున్న నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. తగు విధంగా తెలంగాణకు నీటి కేటాయింపులు చేయమని కూడా కేంద్రమంత్రిని కేసీఆర్‌ ‌కోరినట్లు సమాచారం. ఏపీతో జల వివాదాలు, కృష్ణా యాజమాన్య బోర్దు పరిధి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌ ‌తన గత పర్యటనలోనూ ఇదే అంశంపై దాదాపు 2 గంటలపాటు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. షెకావత్‌తో భేటీ తర్వాత కేసీఆర్‌..‌కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయల్‌తో చర్చించారు.

నేడు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పలు అంశాలపై చర్చించనున్నారు. మావోయిస్ట్ ‌ప్రభావిత జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర హోంశాఖ నుంచి వంద శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కావటంతో…కేంద్రమే పూర్తి ఖర్చు భరించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply