- బాలాలయంలో ప్రత్యేక పూజలు
- పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు
- ఆనందసాయితో కలసి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అక్కడి బాలాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభం తో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 14వ సారి పాంచ నారసింహుడి దివ్యక్షేత్రానికి కేసీఆర్ వెళ్లడం విశేషం. నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన కోసం వైటీడీఏ, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భువనగిరి జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన ఘాట్ స్వాగత ద్వారం నుంచి పుష్కరిణి, శివాలయం వి•దుగా ప్రధానాలయం వరకు రోడ్డును తీర్చిదిద్దారు. ప్రధానాలయం, క్యూలైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యాదాద్రి లక్ష్మీనారసింహుడి సన్నిధిలో దేవతా వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణరాతి శిలల అపురూప శిల్ప సంపదతో అలరించే అష్టభుజి ప్రాకార బాహ్య ప్రాకారం ఆలయానికి మరో ఆకర్షణ. అలాగే మాఢవీధుల వెంట హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ, పుష్పాల దేవతా ఉద్యానవనం ఆధ్యాత్మికత, ఆహ్లాదాలకు మేళవింపు కానుంది.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రధానాలయం బాహ్య ప్రాకార మండపానికి ఉత్తర దిశగా మొక్కలను నాటారు. నృసింహుడి జన్మ నక్షత్రం స్వాతి, తుల రాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలను, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిథున రాశి ప్రకారం కదంబ వృక్షపు మొక్కలు నాటారు. ఒక్కో వరుసలో 40 చొప్పున హరిహరుల జన్మనక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్య అర్చనకు వినియోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెలివెరిసేలా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. అష్టభుజి ప్రాకార మండపం వెంట, గోపురాలకు అభిముఖంగా పాండిచ్చేరి కి చెందిన నాణ్యమైన కుండీల్లో దేవతా ప్రాధాన్యం గల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే గత పర్యటన సందర్భంగా చేసిన సూచనల మేరకు పనులు జరిగాయా.. ఇంకా పూర్తి కావాల్సి ఉన్న పనుల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థపతి ఆనంద్‌సాయితో కలిసి సీఎం కొండపై చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు.
యాదాద్రి పునర్నిర్మాణ ప్రధానాలయ పరిసరాలను సీఎం సునిశితంగా పరిశీలించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లులను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయించిన క్యూలైన్ గ్రిల్స్‌పై శంకుచక్రాలు, గోవిందా నామాలు, ముఖమండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూలైన్లపై పలు సూచనలు చేశారు. ••ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించగా…ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్ల వరకు ఖర్చయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిఎం వెంట ఎంపి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఇవో గీత,యాడా వైస్ ఛర్మన్ కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.