Take a fresh look at your lifestyle.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై శనివారం సిఎం కెసిఆర్‌ ‌సమీక్ష

హైకోర్టు ఆదేశాల పేసథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
సమస్యలు పరిష్కరించే దిశగా కసరత్తు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వొస్తున్న విమర్శలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ‌ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష జరుపనున్నారు.  రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ ‌సహా పాన్‌, ‌కులం, సోషల్‌ ‌స్టేటస్‌, ‌ఫోన్‌ ‌నెంబర్‌, ‌ఫ్యామిలీ మెంబర్ల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో..ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులతో సవి•క్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వ్యవసాయేతర ఆస్తుల  రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

హైకోర్టు నిర్ణయంపై సుప్రీమ్‌కోర్టుకు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి  రిజిస్ట్రేషన్ల పక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల  రిజిస్టేష్రన్ల పక్రియలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆధార్‌, ‌కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని హావి• ఇచ్చిన సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. ఈనెల 10న ఏజీ కోర్టుకు ఇచ్చిన ప్రమాణపత్రంలో ఆధార్‌ అడగబోమని తెలిపిన విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. గిరిజన ప్రాంతాల్లోని భూములను ధరణిలో చేర్చడాన్ని సవాలు చేస్తూ వీరమల్లు, మరొకరు దాఖలు చేసిన వ్యాజ్యంలో విచారణ సందర్భంగా.. తమకు ఆ అధికారం ఉందని ప్రభుత్వం కౌంటర్‌ ‌వేసింది. దీనిపై తాము అఫిడవిట్‌ ‌వేస్తామని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది చెప్పడంతో విచారణ వాయిదా పడింది. వీటన్నిటిపైనా అధికారులు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. సిఎం సవి•క్షలో ఈ అంశాలన్నీ పరిశీలనకు రానున్నాయి. వీటిని అధిగమించి ముందుకు సాగేందుకు సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించినట్లు సమాచారం.

Leave a Reply