Take a fresh look at your lifestyle.

పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు రోశయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్‌ ‌సంతాపం

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. రోశయ్య సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తు చేసుకున్నారు.  సిఎం కెసిఆర్‌ ‌రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ‌తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply