Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌తమిళి సైతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ

అసెంబ్లీ సమావేశాలు, కొరోనాపై చర్చ
బంధువైన ఎంపి మృతిపై పరామర్శ

గవర్నర్‌ ‌తమిళిసైతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, కొరోనాపై కేసీఆర్‌ ‌చర్చించినట్లు సమాచారం. తమిళిసై బాబాయి,కన్యాకుమారి ఎంపి  మృతి చెందడంతో కేసీఆర్‌ ‌పరామర్శించారు. సెప్టెంబర్‌ 7 ‌నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్‌ ‌నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులను కేసీఆర్‌ ‌కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో  తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసైతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశాలు, కొరోనాతో పాటు పలు విషయాలపై గవర్నర్‌తో సీఎం చర్చించారు. అనంతరం తమిళిసై బాబాయి మృతి చెందడంపై కేసీఆర్‌ ‌పరామర్శించారు. కాగా.. తమిళనాడు కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు వసంతకుమార్‌ ‌కన్నుమూసిన విషయం విదితమే. 70 సంవత్సరాల వసంత్‌కుమార్‌ ‌కొరోనాతో చెన్నై అపోలో హాస్పిటల్‌లో ఆగస్ట్ 10‌న చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. వసంత్‌ ‌కుమార్‌ ‌ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్‌ ‌పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ గవర్నర్‌ ‌తమిళసైకు స్వయానా బాబాయ్‌ అవుతారు.

Leave a Reply