Take a fresh look at your lifestyle.

నేడు కలెక్టర్లతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ

  • పల్లె, పట్టణప్రగతి, హరితహారంలపై దిశా నిర్దేశం
  • జరిగిన కార్యక్రమాల పురోగతిపై సవి•క్ష
  • ప్రజలంతా భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ

‌సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం, గ్రామాలు, పట్టణాల పారిశుద్ధ్యం లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ ‌శనివారం కలెక్టర్లతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఆరువిడతలుగా హరితహారం దిగ్విజయంగా కొనసాగడంతో పాటు, దాని ఫలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని కొనసాగిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ఈ ‌కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు పోతున్నారు. జూలైలో హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోమారు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాలను విశ్లేషించి ముందుకు సాగేలా కలెక్టర్లను అధికారులను అప్రమత్తం చేయనున్నారు.

ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధించడంతో మరోమారు చేపట్టాలని సిఎం నిర్ణయించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై బుక్‌లెట్‌ ‌రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ఇప్పటికే ఆదేశించారు. ప్లలె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై సీఎస్‌ ‌సవి•క్షించారు. చేయాల్సిన కొత్త కార్యక్రమాలపై చర్చించారు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం కోసం గ్రామాలు, మున్సిపల్‌ ‌వార్డుల వారీగా అధికారులు బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కలెక్టర్లతో 26న సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో పాటు డీపీవోలు, డీఆర్డీవోలు హాజరు కానున్నారు.

సీఎం, కలెక్టర్ల సమావేశంలో మంత్రులు కూడా పాల్గొననున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, జూలై 1 నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతేడాది సిఎం నర్సాపూర్‌ అర్బన్‌ ‌పార్కులో అల్ల నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి విరివిగా మొక్కలు నాటి రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలని కెసిఆర్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply