Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్ భూముల దలారీలా వ్యవహరిస్తున్నారు

పార్మాసిటీ వ్యవహరాన్ని ఒక పెద్ద బ్రోకరేజ్ వ్యవస్థలా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాకుండా  భూముల దలారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . సోమవారం అసెంబ్లీ లోని మీడియా పాయిట్ వద్ద ఆయన మీడియా తో మాట్లాడుతూ … ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోందని ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఒక దలారి  వ్యవస్థలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులుకు మూడు ఎకరాలు పంచుతామని హామీలు ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, పేద వర్గాలకు పంచిన భూమిని అక్రమంగా లొక్కొంటోందని విమర్శించారు.. అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు ఊడ్చేసినట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పార్మా సిటీ పేరుతో 6 గ్రామాల్లోని దాదాపు 8 వేల దళిత, గిరిజన, పేదల భూములను కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటోందన్నారు.

ప్రజాప్రయోజనాల కోసం అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు కోసం లేదా ప్రభుత్వమే నిర్మించే బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి భారీ పరిశ్రమల కోసం భూములు సేకరించడం తప్పుకాదని.. కేవలం ఒక దలారీగా మారి భూములను రైతులనుంచి అక్రమంగా సేకరించడం నేరమని విమర్శించారు.పార్మాసిటీ పేరుతో పేద రైతుల భూములను అమెరికా సంస్థలకో, లేక మల్టీ నేషనల్ కంపెనీలకో కట్టపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఫార్మాసిటీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాలతో పాటు హైదరాబాద్ పరిసరాలు కూడా పూర్తిగా కలుషితం అవుతాయని దీనికి  సంబంధించి ఒక నివేదకను సైతం  చూపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాప్రయోజనాల పేరుతో పేద రైతుల, కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూములు లాక్కుంటే.. సీఎల్పీకి తెలియజేయండి.. ఖచ్చితంగా మేము వస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి లాక్కొంటున్న భూముల్లో అసైన్ భూములు వివరాలను భట్టి వెల్లడించారు. మేడేపల్లి గ్రామంలో వెయ్యికి పైగా, తాటిపర్తిలో 752, కురుమిద్ద గ్రామంలో 1222, కందుకూరు మండలం ముచ్చెర్ల గ్రామంలో 2,382, మీర్ ఖాన్ పేటలో 1083 ఎకరాల అసైన్ భూములను కేసీఆర్ దలారీగా మారి లాక్కుంటున్నారని అన్నారు. పేదలకు మాత్రం ఎకరాకు 8 లక్షలు ఇచ్చి.. ఆయన మాత్రం ఎకరాను కోటి 50 లక్షల రూపాయాలకు అమ్మకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసం కానీ.. వాళ్ల భూములతో బ్రోకర్ లా వ్యాపారం చేసేందుకు కాదని అన్నారు. ప్రజలకు సంబంధించిన భూములను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

Leave a Reply