Take a fresh look at your lifestyle.

ట్రంప్‌కు సీఎం కేసీఆర్‌ అపురూప కానుక

CM KCR is a unique gift for Trump Pochampally Shalva

  • పోచంపల్లి శాలువా
  • చార్మినార్‌ ‌జ్ఞాపిక!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంగళవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు అపురూపకానుక అందజేశారు..రాష్ట్రపతి రామ•నాథ్‌కోవింద్‌ ‌డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌గౌరవార్ధం ఇచ్చిన ప్రతిష్ఠాత్మక విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేందుకు గొప్ప గౌరవం లభించిన విషయం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలేదేరి సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.. రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌నకు ఇచ్చేందుకు కేసీఆర్‌ ‌స్పెషల్‌ ‌గిప్ట్ ‌తో ఢిల్లీకి చేరుకున్నారు.తెలంగాణకే తలమానికంగా నిలిచిన చేనేతకు చెందిన . పోచంపల్లి శాలువా కప్పి, చారితాత్మ్రక చార్మినార్‌ ‌మెమెంటోను ట్రంప్‌కు కేసీఆర్‌ అం‌దించనున్నారు.. ప్రత్యేకంగా డిజైన్‌ ‌చేసిన పోచంపల్లి, గద్వాల్‌ ‌చీరలను.. మెలానియా, ఇవాంకకు బహూకరించేందుకు కేసీఆర్‌ ‌స్పెషల్‌గా తయారు చేయించారు. గతంలో కూడా హైదరాబాద్‌ ‌పర్యటన సందర్భంగా ఇవాంకకు ముఖ్యమంత్రి ప్రత్యేక బహుమతి అందజేసిన విషయం తెలిసిందే.రాష్ల్రావారీగా పరిశీలిస్తే ఈ విందుకు కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్‌, ‌హరియాణా రాష్టాల్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలను పంపించారు.

కేంద్ర మంత్రులు, పలువురు వీఐపీలు,రక్షణశాఖ సీనియర్లు ఈ విందుకు మాజరయ్యారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డికి మాత్రం ఈ అవకాశం లభించలేదు. జగన్‌ ‌కొద్దిరోజుల కిందటే ఢిల్లీ వెళ్లి మోదీ-షాలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ విందుకు దేశ వ్యాప్తంగా ఎంపికచేసిన 90 నుంచి 95 మంది ముఖ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. వీరిలో ఎనిమిది మంది ముఖ్యమంత్రులున్నారు. కేసీఆర్‌తో పాటు అసోం, హరియాణ, కర్ణాటక, బిహార్‌, ‌మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా సీఎంలకు ఆహ్వానం పలికారు. ఈ ఎనిమిది మందిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీరిలో విపక్ష- పాలిత రాష్టాల్ర సీఎంలెవరూ లేరు. అసోం, హరియాణా, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. బిహార్‌, ‌తమిళనాడు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకేల ఏలుబడిలో ఉన్నాయి.

 

అందునా బిహార్‌లో బీజేపీ కూడా ఓ భాగస్వామ్య పక్షం. ఇక మహారాష్ట్రలో ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం, నేటికీ ఆ బంధాన్ని పూర్తిగా తెంపుకోలేక ఊగిసలాడుతున్న శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఉంది. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే కేవలం రెండ్రోజుల కిందటే కొడుకుతో సహా ప్రధాని మోదీని కలిసి ఆంతరంగిక చర్చలు జరిపారు.. ఇక ఒడిసాలోని అధికార బీజేడీ… పూర్తి తటస్థ పక్షం. జాతీయ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికే పరిమితమైన ప్రభుత్వాన్ని నవీన్‌పట్నాయక్‌ ‌నడిపిస్తున్నారు.. ఆఖరికి ఇటీవలే భారీ ఆధిక్యంతో నెగ్గిన, కేవలం స్థానికంగా ఉండే ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు కూడా పిలుపు రాలేదు. ట్రంప్‌ ‌తొలి మజిలీ గుజరాత్‌ ‌కాబట్టి అక్కడి సీఎం విజయ్‌ ‌రూపానీని ఈ జాబితానుంచి మినహాయించారు. ప్రధానప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్‌ ‌నేతలెవ్వరూ ఈ విందుకు హాజరుకాకపోవడం గమనించాల్సిన అంశం.. రాష్ట్రపతి ఇచ్చే విందుకే కాదు, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ‌పర్యటన షెడ్యూల్‌లో కూడా • ఢిల్లీ సీఎంకు ప్రాధాన్యం ఇవ్వనేలేదు. ఢిల్లీ స్కూళ్లలో హ్యాపీనెస్‌ ‌బోధన ప్రణాళికను ప్రత్యక్షంగా చూసేందుకు మెలానియా సర్వోదయ స్కూలుకు వెళ్లారు.

Leave a Reply