Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

  • క్షేత్రస్థాయిలో సహాయక బృందాలను సిద్ధం చేయాలి
  • రాష్ట్రంలో భారీ వర్షాలపై సిఎం కెసిఆర్‌ ఆరా..అధికారులతో ఢిల్లీ నుంచి సమిక్ష
  • అధికారులను అప్రమత్తం చేసిన సిఎస్‌…‌ కలెక్టర్లతో సమిక్ష

వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్‌, ‌రోడ్లు, నాలాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మున్సిపల్‌, ‌పంచాయతీరాజ్‌, ‌విద్యుత్‌ ‌సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఢిల్లీ నుంచి సమిక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్‌ ‌సోమేష్‌కుమార్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బలగాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ ‌బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకు నేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వొచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్‌ ‌కోరారు.

అధికారులను అప్రమత్తం చేసిన సిఎస్‌…‌ కలెక్టర్లతో సమిక్ష
వర్షాలపై సిఎం కెసిఆర్‌ ‌సూచనల మేరకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సీఎస్‌ ‌సవి•క్షించారు. 20 జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం సమిక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్‌ ‌రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయని, అన్ని జలాశయాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. చెరువు కట్టలు పటిష్టంపై చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ‌సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జలాశయాల పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Leave a Reply