Take a fresh look at your lifestyle.

‌ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

  • కొరోనా కారణంగా నిరాడంబరంగా జెండా పండగ
  • ప్రగతిభవన్‌లో పతాకావిష్కరణ చేసిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ ‌ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరిగాయి.  వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.

కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్‌ ‌పేరేడ్‌ ‌గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. దీనిలో భాగంగా దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply