Take a fresh look at your lifestyle.

మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం

రాష్ట్రంలో కరుణ మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్ డోన్ ప్రకటించిన నేపథ్యంలో లో సీఎం కేసీఆర్ గారు పరిస్థితులను సమీక్షించేందుకు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు . ప్రభుత్వ ఉన్నతాధికారి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పౌరసరఫరాల వ్యవస్థ శాఖ, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నత అధికారులు పాల్గొంటారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్య , లాక్ డౌన్ నేపథ్యంలో ఉన్న పరిస్థితులను సమావేశంలో సమీక్షించనున్నారు, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం కెసిఆర్ అన్ని జిల్లా కలెక్టర్లు , ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు  అని  తెలుస్తుంది.

Leave a Reply