Take a fresh look at your lifestyle.

సోలిపేట సుజాతకు బిఫాం ఇచ్చిన సిఎం కేసీఆర్‌

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సుజాత
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత -రామలింగారెడ్డి బుధవారం సాయంత్రం మంత్రి హరీష్‌ ‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి,ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్‌ ‌రావును కలిశారు. ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు సిఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపడంతో పాటు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌సుజాతకు పార్టీ బిఫామ్‌ని అందజేశారు.

పార్టీ కోసం, ప్రజల కోసం పాటు పడాలరీచ జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని సీఎం కేసీఆర్‌ ‌సూచించారు. బిఫామ్‌ అం‌దుకున్న సుజాత మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సహంను, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలనీ, మీరు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాన్నారు. మీ ఆశీస్సులతో ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌ ‌హుస్సేన్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకులు బట్టి వెంకటయ్య, రొట్టె రాజమౌళి ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply