Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ‌కసరత్తు

నేడు టీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం
వచ్చే నెలలో జరుగనున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌కసరత్తు ప్రారంభించారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదలైన నేపథ్యంలో ఎన్నికలలో గెలుపుపై అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు బుధవారం టీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ, శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వం చేసుకుని సమావేశానికి రావాల్సిందిగా మంత్రులకు సీఎం సూచించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ సంచలన విజయం సాధించి ఊపు మీదుండటం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై విమర్షలతో జోరు పెంచడంతో ఈ రెండు పార్టీలను నిలువరించి జీహెచ్‌ఎం‌సిపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్‌ఎం‌సి పరిధిలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసమ్మతి నేతలతో ఎలా వ్యవహరించాలి ? విపక్షాల ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి ? ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అనే అంశాలపై నేటి సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.

Leave a Reply