- ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలపై సిఎం కెసిఆర్ ఫైర్
- అవకాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరిక
- కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా బిజెపి వ్యవహారం
- తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ
- హాలియా సభలో సిఎం కెసిఆర్
ప్రతిపక్షాల విమర్శలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అవాకులు చవాకులు పేలితే తొక్కి పడేస్తామని అన్నారు. మా ముందు వి•రెంత అంటూ హుంకరించారు. బుధవారం హాలియా బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. హద్దు వి•రినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.
తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు కాదా అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్ అన్నాడు..ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత అయినా మాట్లాడారా? రాజీనామా చేశారా? కవి•షన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు.. వి•రు నాగార్జునసాగర్ కవి•షన్ల కోసమే కట్టారా? నల్గొండ ప్లోరైడ్ సమస్య గురించి ఒక్కరైనా మాట్లాడారా? రైతుబంధు, రైతుబీమా వొస్తుందన్నందుకు పోరుబాట చేస్తారా? కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు.
విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదు. దేశంలోనే అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం మనది. కల్యాణలక్ష్మి ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూనే.. వాటిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను చెప్పే వాటిలో ఏ ఒక్క అబద్ధం ఉన్నా.. నాగార్జున సాగర్‌లో టీఆరెస్‌ను ఓడించాలని ప్రజలనుద్దేశించి కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని వంద శాతం తరిమేశామని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. కలలో కూడా ఎప్పుడూ రైతుబంధు ఆలోచన చేయని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడదే రైతుబంధు తీసుకుంటూ కూడా విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో గత దుస్థితికి ఎవరు కారణం? గతంలో రైతుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మండిపడ్డారు. పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టారని, ఇప్పుడు పొలంబాట, పోరు బాట అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శిం చారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరో నామినేట్ చేస్తే వొచ్చిన ప్రభుత్వం కాదు మాది. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మేం తలుచుకుంటే వి•రు దుమ్ముదుమ్ము అయిపోతారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చో లేదు. బీజేపీ నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సీఎం హెచ్చరించారు.